‘ఆర్.ఎక్స్.100 ‘ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా తర్వాత అతనికి ఆ స్థాయి సక్సెస్ అయితే పడలేదు. కమర్షియల్ గా అతను నటించిన కొన్ని సినిమాలు యావరేజ్ రిజల్ట్ ను దక్కించుకున్నాయి.. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ‘వలీమై’ వంటి సినిమాల్లో విలన్ గా కూడా చేశాడు. అయినా అవి సక్సెస్ కాలేదు. ఇక మరికొద్ది గంటల్లో కార్తికేయ ‘బెదురులంక 2012’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన దర్శకుడు క్లాక్స్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సి.యువరాజ్ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా..’బెదురులంక 2012′ సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ తో మేకర్స్ కొన్ని చోట్ల ప్రీమియర్స్ వేయడం జరిగింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ఖాతాల్లో చెప్పుకొచ్చారు.ట్రైలర్ లో చూపించినట్టే.. 2012 టైంలో యుగాంతం వస్తుంది అనే పుకార్ల చుట్టూ జరిగే కథ ఇది.
ముఖ్యంగా ఓ గ్రామంలో కొంతమంది పెద్దలు జనాలను మభ్యపెట్టి ఎలాంటి ఘోరమైన పనులకు పాల్పడ్డారు, ఈ క్రమంలో శివ అనే కుర్రాడు ఏం చేశాడు. అతనికి ప్రెసిడెంట్ కూతురికి మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. చివరికి ఏమైంది అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. ఇక సినిమా చూసిన వారి టాక్ ప్రకారం.. ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) ఫస్ట్ హాఫ్ పరంగా యావరేజ్ గా ఉంటుందట. కానీ సెకండ్ హాఫ్ బాగా వచ్చింది అని వినికిడి.
ముఖ్యంగా చివరి 40 నిమిషాలు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందట. కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది అని తెలుస్తుంది. మొత్తంగా ఈ సినిమా డీసెంట్ టు గుడ్.. అనే రిపోర్ట్స్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి రేపు మార్నింగ్ షోల తర్వాత టాక్ ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.