Samantha: సమంత ‘యశోద’ కోసం ఎంత కష్టపడిందో చూశారా!

స్టార్ హీరోయిన్ సమంత తనకు సోకిన అరుదైన వ్యాధి గురించి.. దాని ద్వారా తను పడుతున్న ఇబ్బందుల గురించి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.. తను కొంతకాలంగా మ్యోసిటిస్ (కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం, నడవలేకపోవడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కలిగిన వ్యాధి) తో బాధపడుతున్నానని పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్, సినిమా ఇండస్ట్రీ వారు, నెటిజన్లు సామ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న సామ్ రీసెంట్‌గా ఓ వీడియో షేర్ చేసింది. సమంత కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ ‘యశోద’.. శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తుండగా.. హరి – హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ‘యశోద’ థియేట్రికల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ట్రైలర్ చూసిన వాళ్లంతా సమంత పర్ఫార్మెన్స్‌కి పాన్ ఇండియా రేంజ్‌లో పేరొస్తుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు సామ్ ఈ సినిమాకి సంబంధించి..

యశోద యాక్షన్ థ్రిల్స్ పేరుతో.. పేరుతో ఓ మేకింగ్ వీడియో షేర్ చేసింది. యాక్షన్ సన్నివేశాల కోసం తను ఎంత కష్టపడిందనేది వీడియోలో వివరంగా చూపించారు.. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్, మల్టీ టాలెంటెడ్ పర్సన్ యానిక్ బెన్.. ‘యశోద’ లోని యాక్షన్ సీక్వెన్సెస్ కంపోజిషన్, వాటి కోసం ఎలా ట్రైనింగ్ ఇచ్చారో.. బెటర్ ఔట్ పుట్ కోసం సామ్ ఎలా కష్టపడిందో చెప్పుకొచ్చారు.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలకపాత్రల్లో నటించిన ‘యశోద’ నవంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మెయిన్ లీడ్‌గా ఫస్ట్ టైం పాన్ ఇండియా చేస్తుండడంతో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని రిజల్ట్ కోసం ఈగర్‌‌గా వెయిట్ చేస్తోంది సామ్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!


‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus