బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హిందీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన డెబ్యూ మూవీగా ‘ఛత్రపతి’ రీమేక్ ను ఎంచుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా లాంచ్ చేసిన వి.వి.వినాయక్ (V. V. Vinayak) ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయడం జరిగింది.2023 సమ్మర్లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ పెద్ద డిజాస్టర్ అయ్యింది.’బాహుబలి’ (Baahubali) తర్వాత ప్రభాస్ (Prabhas) నటించిన సినిమాలన్నిటినీ నార్త్ జనాలు టీవీల్లో ఎగబడి చూశారు. ‘ఛత్రపతి’ ని అయితే ఎక్కువగానే చూశారు.

అయినప్పటికీ అదే సినిమాని శ్రీనివాస్ తో (Bellamkonda Sai Sreenivas) రీమేక్ చేయడం మిస్టేక్ అయ్యింది అని అంతా అనుకున్నారు. అయితే ‘భైరవం’ (Bhairavam) ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన అనాలిసిస్ కూడా చెప్పుకొచ్చాడు శ్రీనివాస్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “నాకు ముందు హిందీలో చేసిన హీరోలు రానా (Rana Daggubati),చరణ్ మాత్రమే..! చరణ్ (Ram Charan) ‘జంజీర్’ తో (Zanjeer) డెబ్యూ ఇచ్చాడు. అది హిందీ సినిమాని రీమేక్ చేయడం వల్ల ప్లాప్ అయిందేమో అని అనుకున్నాను. కాబట్టి మనం తెలుగు సినిమాని రీమేక్ చేస్తున్నాం కదా..

‘ఛత్రపతి’ లో అమ్మ, సవతి తమ్ముడు ఎమోషన్ కచ్చితంగా వర్కౌట్ అయిపోతుంది అని నిర్మాత కూడా నాకు కాన్ఫిడెంట్ గా చెప్పారు. పైగా రాజమౌళి (S. S. Rajamouli) గారి సినిమాల్లో ఎమోషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది.. కచ్చితంగా హిందీ జనాలకి నచ్చుతుంది అనే నమ్మకం కూడా మొదట్లో కలిగింది. కానీ మధ్యలో షూటింగ్ షెడ్యూల్స్ అవి మారడంతో… ఇది వర్కౌట్ అవుతుందా? అనే డౌట్ వచ్చింది. తర్వాత ఫలితం అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే నేను మంచి కథలు చేస్తున్నాను. ‘హైందవం’ ‘కిష్కిందపురి’ (Kishkindhapuri) వంటివి అన్నీ కథాబలం ఉన్న సినిమాలే” అంటూ చెప్పుకొచ్చాడు.
‘ఛత్రపతి’ హిందీలో ప్లాప్ అవుతుంది అని ముందే తెలుసు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ #BellamkondaSreenivas #BellamkondaSrinivas #Bhairavam #Prabhas
Video credits : @greatandhranews @sairaaj44 pic.twitter.com/qcrFlfGYED
— Phani Kumar (@phanikumar2809) May 19, 2025
