బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) మినిమమ్ మార్కెట్ ఉన్న హీరో. ఇతని కెరీర్లో పెద్దగా సక్సెస్..లు లేకపోయినా.. ఇతని మార్కెట్ చూసే నిర్మాతలు సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే గతంలో ఇతను కొంచెం ఆటిట్యూడ్ తో కామెంట్స్ చేసి ట్రోలర్స్ కి దొరికిపోయేవాడు. కానీ ఇప్పుడు అన్నింటిపై ఆవాహన తెచ్చుకున్నట్టు స్పష్టమవుతుంది. పెద్ద హీరోలు కూడా తమ కొడుకులను హీరోలుగా లాంచ్ చేయాలంటే ఆలోచిస్తారు.
మీ ఫాదర్ మిమ్మల్ని ఏ ధైర్యంతో ఇండస్ట్రీ మీదికి వదిలేశారు? అంటూ యాంకర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ప్రశ్నించగా.. ‘మా నాన్నగారు చాలా స్ట్రాంగ్ పర్సన్. చాలా టఫ్ డెసిషన్స్ తీసుకుంటారు. అదే సమయంలో పిల్లలంటే ఆయనకు ప్రాణం. అయితే మొదటి నుండి నాకు ఒక విషయం చెబుతుండేవారు. ‘ఇప్పుడు నీ పక్కన చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నీ చుట్టూ తిరుగుతున్నారు. కానీ రేపు నీకు సక్సెస్ లేదు అంటే.. వీళ్ళలో ఒక్కడు కూడా ఇంటికి రారు.
నీ పక్కన ఉండరు’ అని చెప్పారు. అది నిజం కూడా..! వెంకటేష్ (Venkatesh ), బన్నీ(Allu Arjun) గారిని స్ఫూర్తిగా తీసుకోమని ఆయన అనేవారు. వెంకటేష్ గారికి ముందు నిర్మాతల కొడుకులు సక్సెస్ అయ్యింది లేదు. వెంకటేష్ గారు ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు. మళ్ళీ ఆయన తర్వాత కూడా ఏ నిర్మాత కొడుకు సక్సెస్ అవ్వలేదు. చాన్నాళ్ళకి బన్నీ ఆ రికార్డును బ్రేక్ చేశారు’ అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. అతను చెప్పింది ముమ్మాటికీ నిజం. చూస్తుంటే శ్రీనివాస్ కి చాలా మెచ్యూరిటీ వచ్చినట్టు ఉంది.
వెంకటేష్ గారిని, బన్నీ గారిని స్పూర్తి తీసుకోమని చెప్తాను – Actor Bellamkonda Sai Srinivas#Bhairavam #bellamkondasreenivas https://t.co/morkvVjQPW pic.twitter.com/R1jGnd69wd
— idlebrain.com (@idlebraindotcom) May 20, 2025