టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) షూటింగ్లో గాయపడింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది. ఇందులో రాశీ ముక్కులో నుండి రక్తం రావడం.. అలాగే ఆమె చేతులకి, ముఖానికి కూడా గాయాలు అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ ఫొటోలకి రాశీ ఇలా రాసుకొచ్చింది. ‘కొన్ని పాత్రలు ఇది కావాలి అని అడగవు. డిమాండ్ చేస్తాయి. అలా డిమాండ్ చేసినప్పుడు నీ శరీరం శ్వాసని, గాయాలని లెక్కచేయకుండా పని చేయాలి.
నువ్వు ఒక తుఫాన్ అయితే ఉరుములు వంటివి నిన్ను ఏమీ చేయలేవు. ‘కమింగ్ సూన్’ ‘ అంటూ ఇన్స్పిరేషనల్ గా రాసుకొచ్చింది రాశీ ఖన్నా. ‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత ‘తొలిప్రేమ’ (Tholi Prema) ‘వెంకీ మామ’ (Venky Mama)’జై లవ కుశ’ (Jai Lava Kusa) ‘బెంగాల్ టైగర్’ (Bengal Tiger) వంటి హిట్ సినిమాల్లో నటించింది.ఈమె గ్లామర్ కి, లుక్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయినప్పటికీ ఎందుకో ఈమె స్టార్ స్టేటస్ ను దక్కించుకోలేకపోయింది.
మిడ్ రేంజ్ హీరోయిన్ గానే సినిమాలు చేస్తూ వచ్చింది. ఒక దశలో ‘థాంక్యూ’ (Thank You) ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) వంటి ప్లాపులతో ఈమె పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ అడపా దడపా ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్లో చేసిన ‘ఫర్జి’ వెబ్ సిరీస్.. రాశీ ఖన్నాకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘ఫర్జి సీజన్ 2’ కూడా రూపొందుతుంది.ఆ సిరీస్ షూటింగ్లో భాగంగానే రాశీ (Rashi Khanna) గాయపడినట్టు తెలుస్తుంది.