Bellamkonda Srinivas: ఆ రేర్ ఫీట్ సాధించిన ఒకే ఒక్క టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్!

బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) .. ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కూడా ‘ఛత్రపతి’ అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్టు నిన్న అధికారికంగా ప్రకటించారు. ఓ పోస్టర్ ద్వారా ఈ టైటిల్ ను ప్రకటిస్తూ మే 12న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇదిలా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాను హీరోగా నటించిన ఓ సినిమాతో ఏకంగా ఏకంగా ప్రపంచ రికార్డు కొట్టాడు. మీరు చదువుతుంది నిజమే.

అతను ఏకంగా ప్రపంచ రికార్డు కొట్టాడు.వివరాల్లోకి వెళితే.. బోయపాటి శీను డైరెక్షన్ లో ఇతను ‘జయజానకి నాయక’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకి మంచి మౌత్ టాక్, రివ్యూలు వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్ల బాక్సాఫీస్ వద్ద అంత రికవరీ చేయలేక చతికిలపడింది. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కటౌట్ ను మాస్ సినిమాలకు ఏ రేంజ్లో వాడుకోవచ్చు అనే విషయాన్ని ఈ సినిమాతో చాటి చెప్పాడు బోయపాటి శ్రీను.

ఇక ఈ చిత్రాన్ని ‘జయజానకి నాయక ఖూన్కర్’ పేరుతో హిందీలో డబ్ చేసి యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. ‘పెన్ మూవీస్’ సంస్థ తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ చిత్రాన్ని నార్త్ ఆడియన్స్ కు అందించింది. 4 ఏళ్ళ క్రితం ఈ చిత్రాన్ని విడుదల చేయగా.. ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా 700 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.యూట్యూబ్ లో ఈ రేంజ్లో వ్యూస్ ను కొల్లగొట్టిన సినిమా ఇదే కావడం విశేషం.

దీంతో త్వరలో రాబోతున్న హిందీ ‘ఛత్రపతి’ కి ‘జయజానకి నాయక ఖూన్కర్’ సాధించిన ఈ ఘనత మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అయితే ఈసారి పరీక్ష థియేటర్లలో కాబట్టి.. రిజల్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus