తెలుగు ఇళ్లల్లో పెళ్లి వేడుక ఎంతో వైభవంగా జరుగుతుంది. అమ్మాయిని పెళ్లి కూతురుగా చేసే ముస్తాబు చాలా స్పెషల్. చేతికి గోరింటాకు, పట్టు చీర, బంగారు నగలుతో అమ్మాయి వధువుగా మెరిసిపోతుంది. దానికి తోడు మదిలో ఆనందం కళ్లలో కనిపిస్తుంది. సిగ్గు మోహంలో తొంగి చూస్తుంది. అమ్మాయి జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు అదే. అటువంటి క్షణాలను వెండితెరపైన దర్శకులు మరింత అందంగా చూపించారు. మరి పెళ్లి కూతురిగా అందంతో నిండిన సిగ్గును ఒలకబోసిన తారలపై, వివాహ మహోత్సవ సన్నివేశాలపై ఫోకస్….
నయనతార – శ్రీరామ రాజ్యం సీతారాముల కళ్యాణం.. జగమంతటికి పండుగ. పెళ్లి కూతురిగా సీతమ్మ అందం వర్ణనాతీతం. ఆ పాత్రను శ్రీరామ రాజ్యం సినిమాలో నయనతార చక్కగా ఒదిగిపోయింది.
అనుష్క – మిర్చి ఏ పాత్రలోనైనా అనుష్క ఇమిడిపోతుంది. మిర్చి సినిమాలో పల్లెటూరి పిల్లగా కనిపించింది. అనుష్క పెళ్లికూతురిగా పెళ్లి పీటలపై కూర్చునే సన్నివేశం కథని మలుపుతిప్పుతుంది.
కాజల్ అగర్వాల్ – చందమామఅందాల భరణి కాజల్ అగర్వాల్ చందమామ సినిమాలో పెళ్లి కూతురిగా కనిపించింది. ఆమె అందానికి తోడు పెళ్లి నగలు ఆమెకు మరింత సొగసును తీసుకొచ్చింది. ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చిన సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది.
తాప్సి – మొగుడు క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన మూవీ మొగుడు అపజయం పాలయినప్పటికీ.. ఇందులో వచ్చే పెళ్లి సన్నివేశం అనేక ఎమోషన్స్ నిండి ఉంటుంది. పెళ్లి కూతురిగా తాప్సి చక్కని నటన ప్రదర్శించింది.
జెనీలియా – శశిరేఖా పరిణయం శశిరేఖా పరిణయం పెళ్లి సన్నివేశంతోనే మొదలవుతుంది. ఆ పెళ్లి నుంచి జెనీలియా పారిపోయినప్పటికీ.. ఆమెను పెళ్లి కూతురిగా బాగా ముస్తాబుచేశారు.
అనుష్క – అరుంధతియాభై ఏళ్ళ క్రితం సంస్థానాల్లో అమ్మాయిని పెళ్లి కూతురిగా ఎలా ముస్తాబు చేస్తారో అరుంధతి సినిమాలో కోడి రామకృష్ణ మనకి చూపించారు. ఎంతో ఆనందకరమైన పెళ్లి రోజున ఆ వధువు పశుపతితో పోరాడాల్సి వచ్చింది. ఓ వైపు పెళ్లి కూతురిగా అందాన్ని, పశుపతి పై పోరాడే సన్నివేశంలో ఆవేశంగా అనుష్క అద్భుతంగా నటించింది.
అంజలి – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అంజలి సీత పాత్రలో కనిపించింది. ఆమె పెళ్లి సినిమా క్లైమాక్స్ లో జరుగుతుంది. పెళ్లి కూతురిగా అంజలి నవ్వులు ప్రశాంతమైన ముగింపును ఇచ్చింది.
సమంత – ఏ మాయ చేసావే హిందూ సంప్రదాయం మాత్రమే కాకుండా క్రిస్టియన్ల సంప్రదాయం ప్రకారం వివాహాలను వెండి తెరపైన చూపించారు. అలంటి వాటిలో అందరికీ గుర్తుంది పోయే సన్నివేశం ఏ మాయ చేసావే సినిమాలో ఉంది. అందులో పెళ్లి కూతురుగా సమంత చాలా క్యూట్ గా కనిపించింది.
సోనాలి బింద్రే – మురారి పెళ్లి తంతుని కలర్ ఫుల్ గా చూపించడంలో కృష్ణ వంశీ నేర్పరి. అతని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మురారి సినిమాలో ఒక పాటలో కళ్యాణ్ వైభోగాన్ని కనువిందుగా తెరకెక్కించారు. పెళ్లి కూతురిగా సోనాలి బింద్రే సిగ్గులతో కలిపి అందాన్ని ఒలకబోసింది.
అవికా గోర్ – ఉయ్యాలా జంపాలా అల్లరి పిల్ల వధువుగా ముస్తాబయితే ఉయ్యాలా జంపాలా సినిమాలో అవికా గోర్ లా ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ఈ పెళ్లి వేడుక కొంత సీరియస్ గా సాగి సరదాగా ముగుస్తుంది.
రాధికా ఆప్టే – లెజెండ్ లెజెండ్ సినిమాలో బోయపాటి శ్రీను మహిళల గురించి చక్కగా చెప్పారు. అలాగే పెళ్లి సీన్ ని చాలా ఇంట్రెసింగ్ గా చూపించారు. ముస్తాబు లేని పెళ్లి కూతురిగా రాధికా ఆప్టే ఆకట్టుకుంది.