Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Focus » 2024 Rewind: 2024లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన అత్యుత్తమ చిత్రాలు!

2024 Rewind: 2024లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన అత్యుత్తమ చిత్రాలు!

  • December 26, 2024 / 10:33 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2024 Rewind: 2024లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన అత్యుత్తమ చిత్రాలు!

2024 సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంతగా కలిసి రాని సంవత్సరం. ఎందుకంటే.. రెండు 1000 కోట్ల సినిమాలు లిస్ట్ లో ఉన్నా.. ఓవరాల్ ట్రేడ్ చూసుకుంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చూసిన లాభాలు చాలా తక్కువ. అయితే.. కంటెంట్ విషయంలో మాత్రం తెలుగు సినిమా కొద్దిగా మెరుగుపడింది. ముఖ్యంగా.. కాన్సెప్ట్స్ సినిమాలను ఈ ఏడాది మన దర్శకనిర్మాతలు కాస్త సీరియస్ గా తీసుకున్నారు. 2024 కొత్త తరం దర్శకులకు ఒక మంచి హోప్ ఇచ్చింది. చిన్న సినిమాలు ఈ ఏడాది కమర్షియల్ గా బాగా పెర్ఫార్మ్ చేశాయి. సో, 2024లో తెలుగు సినిమా నుంచి వచ్చిన బెస్ట్ సినిమాలు ఏంటో చూద్దాం.

Best Telugu Films of 2024

గమనిక: ఈ లిస్ట్ లో సినిమాలు కేవలం కంటెంట్ క్వాలిటీ పరంగా మాత్రమే తీసుకోబడ్డవి. కమర్షియల్ హిట్స్ బట్టి కాదు.

1. హనుమాన్ (Hanuman)

నిజానికి ఈ సినిమా విడుదలయ్యే ముందు వరకు ఎలాంటి అంచనాలు లేవు. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాను ప్రమోట్ చేసిన తీరు, తేజ సజ్జా (Teja Sajja) ఒద్దికగా ప్రెస్ మీట్స్ లో చెప్పిన సమాధానాలు సినిమాకు మంచి బజ్ తీసుకురాగా.. విడుదలయ్యాక సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే హనుమంతుడి ఎపిసోడ్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. సీజీ వర్క్ విషయంలో ఈ సినిమా ఒక స్టాండర్డ్ సెట్ చేసింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: జీ5 


2. గామి (Gaami)

ఒక ఇండిపెండెంట్ సినిమాగా మొదలై.. కమర్షియల్ సినిమా ఫార్మాట్ ను పట్టించుకోకుండా, కేవలం కాన్సెప్ట్ ను నమ్ముకుని ఒక ప్యాషనేట్ టీమ్ ఏళ్లతరబడి కష్టపడి తెరకెక్కించిన సినిమా “గామి”. విశ్వక్ సేన్ (Vishwak Sen) గట్సీ క్యారెక్టర్ ప్లే చేసిన ఈ సినిమా కమర్షియల్ గాను వర్కవుట్ అవ్వడం అనేది చెప్పుకోదగ్గ విషయం.


ఓటీటీ ప్లాట్ ఫార్మ్: జీ5

3. ఓం భీమ్ బుష్ (Om Bheem Bush)

ఈ సినిమా ఎప్పడు తీసారో కూడా తెలియదు, సింపుల్ గా నెల ముందు అనౌన్స్ చేసి, విడుదల చేసేసారు. ఏదో కామెడీ సినిమా అనుకుంటే.. ఎవ్వరూ ఊహించని మెసేజ్ ఇచ్చి, విశేషంగా అలరించారు. ఇంత సెన్సిబుల్ టాపిక్ ను దర్శకుడు హర్ష (Sree Harsha Konuganti) డీల్ చేసిన విధానం, రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna ) , ప్రియదర్శీలతో (Priyadarshi Pulikonda) కలిసి శ్రీవిష్ణు (Sree Vishnu) చేసిన కామెడీ భీభత్సంగా వర్కవుట్ అయ్యింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

4. టిల్లు స్క్వేర్ (Tillu Square)

టిల్లు అనే బ్రాండ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్రేజ్ ను కంటిన్యూ చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) తన యాక్టింగ్ & రైటింగ్ తో సీక్వెల్ ను అదే స్థాయి ఎంటర్టైన్మెంట్ తో కొనసాగించిన విధానం మాత్రం అభినందనీయం.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

5. కల్కి 2898 AD (Kalki 2898 AD)

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన “కల్కి” ఓ విజువల్ వండర్. ప్రభాస్ నుండి అభిమానులు మిస్ అవుతున్న కామెడీ యాంగిల్ తోపాటు, ప్రభాస్ ను కర్ణుడిగా చూపించిన విధానం ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. రెండు భాగాలుగా ఈ సినిమాను విడదీయడం అనేది కాస్త ఇబ్బందిపెట్టిన విషయం అయినప్పటికీ.. ఈ ఏడాది వచ్చిన బడా హీరోల సినిమాల్లో ఆడియన్స్ ను సంతుష్టులను చేసిన సినిమా ఇదే అని చెప్పాలి.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

6. కమిటీ కుర్రాళ్లు (Committee Kurrollu)

సరిగ్గా ప్రమోట్ చేస్తే చిన్న సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అని ప్రూవ్ చేసిన సినిమా “కమిటీ కుర్రాళ్లు”. 11 మంది కొత్త హీరోలతో యదు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసి మనసుకి హత్తుకుంది. అనుదీప్ దేవ్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ఈటీవి విన్

7. ఆయ్ (AAY)

ఒక సాధారణ కథతో ప్రేక్షకుల్ని అలరించడం అనేది మంచి టెక్నిక్. చాలా తక్కువమంది ఈ టెక్నిక్ తో హిట్ కొట్టారు. ఆ లిస్ట్ లో ఒకడు అంజి. గోదావరి అందాలతో వెండితెరను నింపేసి, యాసతో కామెడీ పండించి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. అంకిత్ కొయ్య (Ankith Koyya) & కసిరెడ్డి (Rajkumar Kasireddy) కామెడీ టైమింగ్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

8. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)

“అంటే సుందరానికి” (Ante Sundaraniki) సక్సెస్ అవ్వకపోవడంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya)  కసితో తెరకెక్కించిన సినిమా “సరిపోదా శనివారం”. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన అంశాలు, హంగులు పుష్కలంగా ఉన్న ఈ చిత్రం హీరోగా నాని స్క్రిప్ట్ సెలక్షన్ మీద ప్రేక్షకులకు మరింత నమ్మకం పెంచింది. అలాగే.. వివేక్ ఆత్రేయ ఒక రచయితగా తనదైన మార్క్ మిస్ అవ్వకుండా తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్ గాను మంచి విజయం సాధించింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

9. 35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu)

తెలుగులో మంచి సినిమాలు రావు అని బాధపడే చాలామంది, అలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం థియేటర్లలో చూడరు. ఓటీటీలో రిలీజయ్యాక మాత్రం “అరెరే మిస్ అయ్యామే!” అని తెగ బాధపడిపోతుంటారు. “35” ఆ కోవకు చెందిన సినిమా. మంచి కథ, అంతకుమించిన మంచి పాత్రలు, అన్నిటికీ మించిన మంచి ఎండింగ్. ఇలా మంచి అంశాలు ఎన్నో ఉన్న ఈ చిత్రం ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్ గా ఆడాల్సిన స్థాయిలో ఆడలేదు. అయితే.. నివేతా థామస్ (Nivetha Thomas) కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్ట్ ను ఆసక్తికరంగా వివరించిన విధానం సినిమాకి మెయిన్ హైలైట్స్. దర్శకుడు ఈమని నందకిశోర్ (Nanda Kishore Emani) ఈ సినిమాను ఎలాంటి అనవసరమైన అంశాలను ఇరికించకుండా తెరకెక్కించడం అనేది ప్రశంసార్హం

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ఆహా

10. భజే వాయు వేగం ( Bhaje Vaayu Vegam)

చిన్న కథలను ఆసక్తికరంగా చెప్పగలగడం, అందులోనూ టెక్నికల్లీ స్ట్రాంగ్ గా చెప్పగలగడం అనేది చిన్న విషయం కాదు. అందులో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి విజయం సాధించాడు. మల్టిపుల్ లేయర్ స్టోరీ టెల్లింగ్ తో ఆసక్తికరంగా సినిమాను నడిపాడు. కార్తికేయ (Kartikeya) క్యారెక్టర్ తో ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

11. పేకమేడలు (Pekamedalu)

ప్రెజెంట్ జనరేషన్ ఆడియన్స్ కి నీతికథలను హృద్యంగా చెప్పడంలో మన నవతరం తెలుగు దర్శకులు ఎందుకో ఒక అడుగు వెనక ఉండిపోయారు. దర్శకుడు నీలగిరి మామిళ్ల (Neelagiri Mamilla) ఈ విషయంలో కాస్త ముందడుగు వేసాడు. అత్యాశ ఎంత చేటు చేస్తుంది అనే పాయింట్ ను హానెస్ట్ గా చెప్పాడు. అయితే.. ఆసక్తికరంగా చెప్పడంలో కాస్త తడబడ్డాడు. అయినప్పటికీ.. ఈ సినిమా అటెంప్ట్ విషయంలో మంచి మార్కులు సంపాదించుకుంది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

12. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2)


సీక్వెల్ గా వచ్చి సక్సెస్ సాధించిన సినిమాల్లో “మత్తు వదలరా 2” ఒకటి. నితీష్ రాణా (Ritesh Rana) బ్రిలియంట్ రైటింగ్ & సత్య కామెడీ టైమింగ్ ఈ సినిమాని మస్ట్ వాచ్ గా మార్చాయి. ముఖ్యంగా నితీష్ రాణా ఈ సినిమాలో అంతర్లీనంగా ఇరికించిన మీమ్స్ & సెటైర్స్ ఓటీటీ రిలీజ్ తర్వాత హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని కామెడీ చిత్రమిది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

13. దేవర (Devara)

నిజానికి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు. కానీ.. సినిమాలో ఎన్టీఆర్ (Jr NTR)నటన, అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక యాక్షన్ బ్లాక్స్ అయితే మరో లెవల్లో ఉన్నాయి. కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం పార్ట్ 2 వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనన్నమాట.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

14. నరుడి బ్రతుకు నటన (Narudi Brathuku Natana)

Narudi Brathuku Natana

కొన్ని సినిమాలు మనకి మనల్ని గుర్తుచేస్తాయి. మనుషులుగా మనం మరిచిపోతున్న విలువలలు, బంధాల గొప్పతనాన్ని, ఒక మనిషికి సహాయపడడంలో ఉన్న సంతోషాన్ని హృద్యంగా తలపిస్తాయి. ఈ సినిమాలోని సల్మాన్ పాత్ర చూశాక మన జీవితంలోనూ ఇలాంటి స్నేహితుడు ఒకడుంటే బాగుండు అనిపిస్తుంది. శివకుమార్ (Shivakumar Ramachandravarapu) , నితిన్ ప్రసన్న (Nithin Prasanna) నటన మరియు లోపెజ్ నేపథ్య సంగీతం సినిమాని నడిపించాయి. కమర్షియల్ గా సరిగా ఆడలేదు కానీ.. కచ్చితంగా మనసుల్ని హత్తుకునే సినిమా.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో

15. పొట్టేల్ (Pottel)

మనుషుల మధ్య అంటరానితనం అనే ఓ విషపురుగుతో దూరం పెంచి పెత్తనం చెలాయించిన పెత్తందార్ల బానిస సంకెళ్లు తెంచుకుని ఒక్కడు చేసిన పోరాటం ఓ గ్రామం మొత్తానికి ఎలా ఉపయోగపడింది, భవిష్యత్ తరాలు చదువుకోవడానికి ఎలా పనికొచ్చింది అనే థీమ్ తో తెరకెక్కిన “పొట్టేల్” మూలకథ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో.. అజయ్ (Ajay) నటన కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది. సాహిత్ మోత్కూరి (Sahit Mothkhuri) ఇంకాస్త షార్ప్ సీన్ కంపోజిషన్ ప్లాన్ చేసి ఉంటే సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అయ్యుండేది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ఆహా 


16. క (KA)

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram ) కెరీర్ కి చాలా కీలకమైన సినిమా ఇది. అప్పటివరకు అతడి మీద ఉన్న నెగిటివ్ ఇమేజ్ ను పోగొట్టిన సినిమా ఇది. సందీప్-సుజీత్ ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రంలో షాట్ మేకింగ్ & క్లైమాక్స్ ను కన్సీవ్ చేసిన విధానం బాగుంటాయి. సామ్ సి.ఎస్ (Sam C. S.) సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ఈటీవి విన్ 


17. లక్కీ భాస్కర్ (Lucky Baskhar)

ఈ ఏడాది బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన చిత్రంగా లక్కీ భాస్కర్ ను పేర్కొనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. ఒక ఫిలిం మేకర్ గా వెంకీ అట్లూరి (Venky Atluri) స్థాయిని పెంచిన సినిమా ఇది. సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్క లాజికల్ మిస్టేక్ కూడా లేకుండా ఆడియన్స్ కు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టించకుండా సినిమాను నడిపించడం అనేది మామూలు విషయం కాదు.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #35 Chinna Katha Kaadu
  • #Aay
  • #Bhaje Vaayu Vegam
  • #Committee Kurrollu
  • #Devara

Also Read

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

related news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

trending news

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

1 hour ago
The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

1 hour ago
Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

2 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

18 hours ago
Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

19 hours ago

latest news

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

59 mins ago
Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

2 hours ago
Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

18 hours ago
Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

18 hours ago
Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version