నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి'(Bhagavath Kesari) 2023 అక్టోబర్లో రిలీజ్ అయ్యింది.బాక్సాఫీస్ వద్ద అది మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. బాలకృష్ణ కెరీర్లో ఓ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ఆ టైంలో ఈ సినిమాని వీక్షించిన వాళ్ళు తక్కువే. తర్వాత తమిళ, హిందీ వెర్షన్లు రిలీజ్ అయ్యాయి. అయితే కొద్దిరోజులుగా ‘భగవంత్ కేసరి’ తమిళ వెర్షన్ ప్రైమ్లో తెగ ట్రెండ్ అవుతుంది.
దీనికి ప్రధాన కారణం ‘జన నాయగన్’ అనే చెప్పాలి. ఇది ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే ప్రచారం జరిగింది. కానీ ‘భగవంత్ కేసరి’ లో సోల్ మాత్రమే తీసుకుని మొత్తం మార్చేశారని మేకర్స్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల రిలీజ్ అయిన ‘జన నాయకుడు’ ట్రైలర్ చూస్తే.. చాలా వరకు ‘భగవంత్ కేసరి’ ఎపిసోడ్లే కనిపించాయి. కాకపోతే రాజకీయాల ప్రస్తావన కూడా ఎక్కువగా ఉంది. అది విజయ్ పొలిటికల్ ఎంట్రీలో భాగంగా పెట్టిన సన్నివేశాలు అయ్యి ఉండొచ్చు.

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే ‘జన నాయగన్’ ట్రైలర్ విడుదలైన తర్వాత ‘భగవంత్ కేసరి’ మళ్ళీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెగ ట్రెండ్ అవుతుంది. తమిళ ప్రేక్షకులు ‘జన నాయగన్’ ప్రిపరేషన్లో భాగంగా ‘భగవంత్ కేసరి’ ని తెగ చూస్తున్నారు అని అర్ధం చేసుకోవచ్చు. మరోపక్క తెలుగు ప్రేక్షకులు ‘జన నాయగన్’ ట్రైలర్ ‘భగవంత్ కేసరి’ని ఏమాత్రం మ్యాచ్ చేయలేదని కామెంట్స్ పెడుతున్నారు.
బాలకృష్ణ కెరీర్లో ‘భగవంత్ కేసరి’ బెస్ట్ మూవీ అని ఇప్పుడు పొగుడుతున్నారు. ఏదేమైనా విజయ్ సినిమా పుణ్యమాని రిలీజ్ టైంలో కంటే ఇప్పుడు ‘భగవంత్ కేసరి’ ఎక్కువ ట్రెండ్ అవుతుండటం విశేషం.
