కొంతమందికి అదృష్టం, దరిద్రం కంటే గట్టిగా పట్టుకుంటుంది. ఎంతలా కంటే వద్దు అనుకున్నా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) పరిస్థితి అలానే ఉంది. పరిచయ చిత్రం “మిస్టర్ బచ్చన్” (Mr Bachchan) డిజాస్టర్ గా నిలిచినప్పటికీ.. ఆమెకు ఆఫర్ల విషయంలో మాత్రం ఢోకా లేకుండాపోయింది. ఆ సినిమా రిలీజ్ కి ముందే కొన్ని సినిమాలు సైన్ చేసినప్పటికీ.. సినిమా ఫ్లాప్ ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుందో అని భయపడింది అమ్మడు. అయితే.. ఆమె గ్లామర్ & లుక్స్ ఆమె ఆఫర్లను ఎఫెక్ట్ చేయకుండా చేశాయి.
ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో రామ్ పోతినేని (Ram) సినిమా, దుల్కర్ సల్మాన్ తో (Dulquer Salmaan) “కాంత”, విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) “కింగ్డమ్” (Kingdom) సినిమాలున్నాయి. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నారు. అయితే.. వీటన్నిటికీ మించి ఓ భారీ ప్రాజెక్ట్ లో భాగ్యశ్రీ చాన్స్ కొట్టేసింది అని టాక్. ప్రభాస్ (Prabhas) – ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్ లో ఓ సినిమా ఎనౌన్స్ అవ్వనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ లుక్ టెస్టులు జరుగుతున్నాయి.
అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు “భాగ్యశ్రీ బోర్సే”. చాలామంది కొత్త హీరోయిన్లను లుక్ టెస్ట్ చేసినప్పటికీ.. భాగ్యశ్రీకి సెట్ అయినట్లు సదరు లుక్ మరెవరికీ సెట్ అవ్వలేదని వినికిడి. దాంతో ఆమెను కన్ఫర్మ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాడట ప్రశాంత్ వర్మ. ఇదే గనుక నిజమైతే.. భాగ్యశ్రీ టాలీవుడ్ లో సెటిల్ అవ్వడమే కాదు కాజల్ (Kajal Aggarwal) , తమన్నా (Tamannaah) ,, త్రిషల (Trisha) రేంజ్ లో లాంగెస్ట్ కెరీర్ ను కొనసాగించడం కూడా ఖాయం. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పడు వస్తుంది అనేది చూడాలి.