తమన్ (S.S.Thaman) బర్త్ డేని సెలబ్రేట్ చేశారని ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారట. షాక్ అయ్యారా? నిజమే.. కానీ అది ఇప్పటి సంగతి కాదు. విషయంలోకి వెళితే.. ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), తమన్, దర్శకుడు అరివళగన్ (Arivazhagan Venkatachalam) కాంబినేషన్లో ‘వైశాలి’ వచ్చింది. అది మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్లో ‘శబ్దం’ కూడా రూపొందింది. దీని ప్రమోషన్స్ లో భాగంగా తమన్, ఆది ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
తమన్ మాట్లాడుతూ… ”నేను చెన్నైలో ఉన్నప్పుడు నా బర్త్ డేకి సర్ప్రైజ్ ఇద్దామని… కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ మీదకి నన్ను అర్ధరాత్రి 12 గంటలకి రమ్మన్నాడు. నేను వెళ్లేసరికి ఫ్లైఓవర్ మధ్యలో ఆది, అరివళగన్ కేక్ పట్టుకుని నా కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు హ్యాపీ అనిపించింది. తర్వాత కేక్ కట్ చేశాను. ఇంతలో పెట్రోలింగ్ పోలీసులు.. మా వైపు వచ్చారు.
అప్పుడు నా బర్త్ డే కాబట్టి నన్ను వదిలేసి వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. వాళ్లిద్దరూ ఆ రాత్రంతా టీ నగర్ పోలీస్ స్టేషన్ లోనే గడిపారు. ఉదయాన్నే నాకు ఫోన్ చేసి.. ‘ఇప్పుడే రిలీజ్ అయ్యాం. హ్యాపీ బర్త్ డే.. పార్టీ ఎక్కడ?’ అని నన్ను అడిగారు” అంటూ తమన్ ( Thaman) చెప్పుకొచ్చాడు. తర్వాత ఆది ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.
ఆది మాట్లాడుతూ.. ” మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం వేరే ఉంది. తమన్ పుట్టిన రోజు కదా అని మేము క్రాకర్స్ కాల్చి హంగామా చేశాం.అయితే ఆ పక్కనే ఓ మినిస్టర్ ఇల్లు ఉందట, మేము చేసిన రచ్చకి వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవ్వడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. అందుకే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది.అప్పటి నుండి మేము బర్త్ డే సెలబ్రేషన్ బయట చేసుకోవడం మానేశాం” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.