సినిమా ఇండస్ట్రీలో కొన్ని నెలలు ప్రత్యేకమైన మినీ ఫెస్టివల్స్‌లా మారిపోతాయి. ముఖ్యంగా మార్చి (March) నెలలో గతంలో చాలా బిగ్ హిట్స్ వచ్చాయి. 2021లో జాతిరత్నాలు (Jathi Ratnalu), 2022లో ఆర్ఆర్ఆర్ (RRR), 2023లో బలగం (Balagam), దసరా (Dasara) , టిల్లూ స్క్వేర్ (Tillu Squre) లాంటి హిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వరుసను చూస్తే, మార్చి బాక్సాఫీస్‌కు బంపర్ నెల అని చెప్పొచ్చు. మరి 2025లోనూ ఇదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా..? ఈ ఏడాది మార్చిలో కూడా భారీ సినిమాలు వరుసగా రాబోతున్నాయి.
మొదటి వారంలో జిగేల్, ఛావా (Chhaava) విడుదల కానున్నాయి. ఉత్తరాదిలో సూపర్ హిట్ అయిన ఛావా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరం. రెండో వారంలో యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో దిల్ రుబా (Dilruba) రానుంది. అలాగే (Nani) ప్రొడక్షన్‌లో ప్రియదర్శి (Priyadarshi Pulikonda) హీరోగా తెరకెక్కిన కోర్ట్ (Court) సినిమా కూడా అదే వారం రిలీజ్ కానుంది.
నాని ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉండటంతో, ఇది భారీ హిట్ అవుతుందనేది గట్టిగా వినిపిస్తోంది. అలాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ అనే సినిమా రాబోతోంది. శ్రీహర్ష దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.