‘భళా తందనాన’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!

శ్రీవిష్ణు హీరోగా క్యాథ‌రిన్ థ్రెసా హీరోయిన్ గా చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భళా తందనాన’. ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్ పై సాయి కొర్రపాటి సమర్పణ లో రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైన సంగతి తెలిసిందే. అసలు ఈ మూవీ రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలీదు అంటే ప్రమోషన్స్ ఎంత వీక్ గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

సినిమా కూడా పెద్దగా ఆకర్షించే విధంగా లేకపోవడం, రివ్యూలు కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో వీకెండ్ కే ఈ మూవీ చాలా థియేటర్ల నుండీ ఖాళీ అయిపోయింది. ‘అర్జున ఫల్గుణ’ తర్వాత శ్రీవిష్ణు మరో ప్లాప్ ను మూటకట్టుకున్నట్టు అయ్యింది. ఇక ఈ చిత్రం అతి త్వరలో ఓటిటిలో విడుదల కాబోతుంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు రానుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మే 20న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుందట.

నిజానికైతే ఈ వారమే ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఈ వారం పెద్ద సినిమాలు చాలా ఉండడంతో వ్యూయర్ షిప్ రాదని లైట్ తీసుకున్నట్లు ఉన్నారు. థియేటర్లలో ఈ చిత్రం ఎలాగూ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ఓటిటిలో కూడా రాణించకపోతే నిర్మాత భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. అయితే మే 20న ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా ఓటిటిలో పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల కాబోతుంది. మరి ఆ చిత్రం ప్రభావం.. శ్రీవిష్ణు మూవీ పడే ప్రమాదం కూడా లేకపోలేదు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Share.