’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ తో హీరోగా మారిన స్టార్ యాంకర్ ప్రదీప్… తన రెండో ప్రయత్నంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా చేశాడు. దీపిక పిల్లి ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దర్శక ద్వయం నితిన్ – భరత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మొదటి రోజు డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్ వరకు మంచి ఓపెనింగ్స్ పొందింది.
కానీ ఆ తర్వాత అంటే వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇచ్చాక డౌన్ అయిపోయింది. తర్వాత కోలుకోలేకపోయింది. ఒకసారి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.72 cr |
సీడెడ్ | 0.28 cr |
ఆంధ్ర | 0.74 cr |
ఏపీ + ఆంధ్ర (టోటల్) | 1.74 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.28 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.02 cr (షేర్) |