సినిమాల్లోనే ముద్దు సన్నివేశాలు సాధారణం అయిపోయిన రోజులివీ. అలాంటిది వెబ్‌సిరీస్‌ల్లో పెద్ద విషయమా చెప్పండి. రొమాంటిక్ సన్నివేశాలు, శ్రుతి మించిన సన్నివేశాలు కూడా వెబ్ సిరీసుల్లో వచ్చేస్తున్నాయి. బాలీవుడ్ వెబ్ సిరీసుల్లో అయితే ఇంకానూ. అది ఏ జోనర్ సిరీస్ అయినా ఈ సన్నివేశాలు కామన్ అయిపోయాయి. అలాంటి ఈ రోజుల్లో ముద్దు సీన్ వద్దని ఓ నటి చెప్పింది, దానికి అంగీకరించిన టీమ్ స్క్రిప్ట్‌ని మార్చుకుంది. ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? ‘పంచాయత్ 4’ వెబ్ సిరీస్‌లో.
‘పంచాయత్ సీజన్ 4’ ఇటీవల స్ట్రీమింగ్‌కి వచ్చింది. అందులో రింకీ అనే పాత్రలో శాన్విక ఆకట్టుకుంటోంది. ఆ పాత్రకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకునే పనిలో పడ్డారు మన యూత్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో శాన్వి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె సిరీస్‌లో ఓ ముద్దు సన్నివేశానికి నో చెప్పిందని, ఆ నిర్ణయాన్ని గౌరవించి దర్శకుడు స్క్రిప్ట్‌లో మార్పులు చేశారు అనేది ఆమె వ్యాఖ్యల సారాంశం.
శాన్వికి కథ చెప్పినప్పుడు అందులో ముద్దు సన్నివేశాలు లేవట. ఆ తర్వాత కథలో మార్పులు చేసి, కొన్ని అదనపు సన్నివేశాలు యాడ్ చేశారట. అలా ముద్దు సీన్స్ వచ్చి చేరాయి. ఆ విషయాన్ని శాన్వికి చెప్పడంతో రెండు రోజుల సమయం అడిగిందట. కుటుంబంతో కలిసి చూసే ఈ సిరీస్‌లో అలాంటి సీన్స్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది అని శాన్వీ నో చెప్పిందట. దర్శకుడు చెబితే ఏమంటారో అనుకుంటూనే ఫైనల్‌గా చెప్పిందట.
దానికి ఆయన ఓకే చెప్పి సీన్స్ మార్చారట. ఈ రోజుల్లో ఇలా నో చెప్పే నటులు, ఆ మాటలకు యస్ చెప్పే మేకర్స్ ఉన్నారు అంటే.. అందులోనూ బాలీవుడ్‌లో ఉన్నారు అంటే పెద్ద విషయమే. కానీ ఈ సిరీస్ విషయంలో అలా జరిగింది.