ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలంటే ఆ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత కచ్చితంగా ఉండాలనే సంగతి తెలిసిందే. భారతీయుడు2 (Bharateeyudu 2) సినిమా నిడివి ఎక్కువైందని కామెంట్లు రావడంతో 20 నిమిషాలు ట్రిమ్ చేయడం జరిగింది. అయితే ట్రిమ్ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని సమాచారం అందుతోంది. వీక్ డేస్ లో భారతీయుడు2 సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించడం లేదు. ఈ సినిమాకు భాషతో సంబంధం లేకుండా భారీ నష్టాలు ఖాయమని తేలిపోయింది.
బాక్సాఫీస్ వద్ద శంకర్ (Shankar) మ్యాజిక్ పని చేయకపోవడానికి కారణాలు ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. రెండు భాగాలుగా శంకర్ భారతీయుడు2 , భారతీయుడు3 తెరకెక్కించాలని అనుకోవడమే పెద్ద తప్పు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భారతీయుడు2 సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. మరోవైపు శంకర్ మంచి స్టోరీ లైన్ ను ఎంచుకుంటున్నా కథనం విషయంలో పొరపాట్లు చేస్తుండటం కూడా సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతోంది.
శంకర్ సరైన టీమ్ ను సెట్ చేసుకుంటే మాత్రమే ఈ పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి. శంకర్ ను నమ్మి నిర్మాతలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. రోబో సినిమా తర్వాత శంకర్ తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాతో నిరాశ పరిచారు. 2.0 (Robo 2.O) సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఆ సినిమాకు సైతం అన్ని ఏరియాలలో లాభాలు రాలేదు.
శంకర్ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాలి. భారతీయుడు2 రిజల్ట్ వల్ల గేమ్ ఛేంజర్ మూవీ అప్ డేట్స్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. శంకర్ కెరీర్ ప్రమాదంలో పడిందని శంకర్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.