పవన్, రానా హీరోలుగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ నుంచి 140 కోట్ల రూపాయల ఓటీటీ ఆఫర్ వచ్చిందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే భీమ్లా నాయక్ మేకర్స్ మాత్రం ఈ ఆఫర్ కు నో చెప్పారు. ఈ ఆఫర్ కు ఓకే చెబితే 20 కోట్ల రూపాయలు టీడీఎస్ రూపంలో ముందే చెల్లించాల్సి ఉంటుంది.
టీడీఎస్ తో పాటు జీఎస్టీ ఇతర వ్యవహారాలు ఉండటంతో నిర్మాతలకు భారీగా లాభాలు మిగిలే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాకు 20 కోట్ల రూపాయలు అంటే ఒక పెద్ద ఏరియా థియేట్రికల్ హక్కులతో సమానం అనే సంగతి తెలిసిందే. మరోవైపు ఆఫర్ కు ఓకే చెప్పినా ఓటీటీ సంస్థలు పేమెంట్లు వెంటనే చేయడం లేదు. ఈ కారణాల వల్లే భీమ్లా నాయక్ మేకర్స్ ఓటీటీ ఆఫర్ విషయంలో వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.
మరోవైపు పవన్, రానా లాంటి పెద్ద హీరోల సినిమాలు ఓటీటీకి వెళితే ఫ్యాన్స్ నుంచి విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ కారణం వల్ల కూడా నిర్మాతలు భీమ్లా నాయక్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించి ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2022 సంవత్సరం మార్చి నెల 31వ తేదీకి భీమ్లా నాయక్ వాయిదా పడిందని వార్తలు వస్తుండగా మేకర్స్ స్పందించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పవన్, రానా అభిమానులు ఈ మూవీ కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?