పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ తెలుగు వెర్షన్ ముందుగా ప్రకటించిన ప్రకారం శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ కానుంది. భీమ్లా నాయక్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ వరకు భీమ్లా నాయక్ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు అంతకంతకూ తగ్గడం భీమ్లా నాయక్ సినిమాకు కలిసొచ్చింది.
కరోనా థర్డ్ వేవ్ తర్వాత రిలీజవుతున్న భారీ బడ్జెట్ సినిమా భీమ్లా నాయక్ కాగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కావడంతో భీమ్లా నాయక్ మేకర్స్ సైతం ట్రైలర్ లోనే ఈ సినిమా కథను లీక్ చేశారు. యూట్యూబ్ లో భీమ్లా ట్రైలర్ వ్యూస్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. నిర్మాతలు ట్విట్టర్ ద్వారా ఈ సినిమా ట్రైలర్ వ్యూస్, లైక్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
పుష్ప సినిమా హిందీలో సక్సెస్ కాగా భీమ్లా నాయక్ కూడా హిందీలో సంచలన విజయాన్ని అందుకుంటుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. భీమ్లా తెలుగులో రిలీజైన కొన్ని రోజుల తర్వాత హిందీలో రిలీజ్ కానుందని బోగట్టా. ప్రోపర్ పబ్లిసిటీతో సినిమాను హిందీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. హడావిడిగా హిందీలో భీమ్లా నాయక్ ను విడుదల చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని మేకర్స్ అనుకుంటున్నారు. పుష్ప తర్వాత హిందీలో విడుదలైన ఖిలాడీ ప్రేక్షకుల మెప్పు పొందలేదు.
భీమ్లా నాయక్ హిందీ రిజల్ట్ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. భీమ్లా నాయక్ హిందీ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!