Bheemla Nayak Trailer: ఇది డబుల్ బొనాంజా.. బ్లాక్ బస్టర్ ఊపు ఇది..!

మొన్ననే `భీమ్లా నాయ‌క్‌` ట్రైలర్ రిలీజ్ అయ్యింది.ఆ ట్రైలర్ ప‌వ‌న్ అభిమానులకు పూనకాలు తెప్పించింది అనే చెప్పాలి.రానా పాత్ర‌ కూడా ఏమాత్రం తగ్గలేదు. అయితే తమన్ అందించిన నేపథ్య సంగీతం విషయంలో పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ సంతృప్తి చెందలేదు.తమన్ దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చినా అభిమానులు దానికి కన్విన్స్ అవ్వలేదు. బహుశా అందుకేనేమో ఇప్పుడు మరో ట్రైలర్ ను వదిలారు. ఈ ట్రైలర్ కూడా రెండు నిమిషాల నిడివి కలిగి ఉంది.

Click Here To Watch

భీమ్లా పై హైప్ పెంచిన `లాలా… భీమ్లా` పాట‌ బ్యాక్ గ్రౌండ్ నే… ట్రైల‌ర్ లో వాడారు. రానా…పవన్ ను ఉద్దేశించి… “ఎవ‌డాడు.. ఏమైనా దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్‌.ఐ…“ అంటూ గంభీరంగా అరుస్తున్నప్పుడు.. ప‌వ‌న్ ఎంట్రీ ఇవ్వ‌డం ఇవ్వడం మంచి హై ఇచ్చింది. అయితే ప‌వ‌న్ ఎలివేష‌న్లే ఇందులో ఎక్కువ‌గా ఉన్నాయి. గత ట్రైలర్ తో పోలిస్తే ఈసారి త‌మ‌న్ ఓకె అనిపించాడు. “ఏయ్ రామ‌స్వామి… రాయ‌వ‌య్యా ఎఫ్‌.ఐ.ఆర్‌.. ఈడు బ‌లిసి కొట్టుకుంటున్నాడు…

మ‌న‌మేంటో చూపిద్దాం“, “నాయ‌క్ పెళ్లాం అంటే నాయ‌క్ లో స‌గం కాదు.. నాయ‌క్ కి డ‌బుల్“ వంటి డైలాగులు కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని చెబుతున్నాయి. మొన్నటి ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ మంచి కిక్ ఇచ్చింది. ముందుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసి ఉంటే పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేవారు కాదు. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!


బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus