టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న క్రేజీ చిత్రాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగు ఆడియన్స్ కు తగ్గట్లుగా కమర్షియల్ హంగులతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల సినిమా గ్లింప్స్ కు, ఒక పాటకు మంచి క్రేజ్ వచ్చింది. హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ రికార్డ్ మొత్తానికి అమ్ముడైపోయాయి.
శాటిలైట్, డిజిటర్ల హక్కుల కోసం రూ.70 కోట్ల రేంజ్ లో బేరం సాగుతుందని సమాచారం. రేట్లు, ఆక్యుపేషన్ ఇలా అన్నీ కరెక్ట్ గా ఉంటే తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి రూ.80 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ ఉంటుంది. అంటే సినిమా మొత్తం బిజినెస్ కలిపి రూ.170 కోట్ల వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ రేంజ్ మొత్తం వస్తే ఓటీటీకి సినిమాను ఇవ్వడానికి నిర్మాతలు సముఖంగా ఉన్నారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.
ఈ విషయంలో పవన్ నిర్మాతలకు సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాల నిర్మాతలకు పిలిపించి.. మీకు నచ్చితే సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయండని.. ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారట. ఈ విషయంలో ఎంతవరకు నిజముందో కానీ.. ‘భీమ్లా నాయక్’ ఓటీటీ రిలీజ్ అనే విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నిర్మాతలు స్పందిస్తారేమో చూడాలి!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!