Bheemla Nayak: ఆర్.ఆర్.ఆర్, పుష్ప రికార్డులను బ్రేక్ చేస్తున్న భీమ్లా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ మరికొన్ని రోజుల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతోంది. ఓ వర్గం వారి నుంచి నెగిటివ్ టాక్ వచ్చిన్నప్పటికీ కూడా సినిమా యూట్యూబ్లో అయితే భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకోవడమే కాకుండా లైక్స్ కూడా గట్టిగానే అందుకుంటోంది.

Click Here To Watch

ఇక పాత సినిమాల ట్రైలర్ రికార్డులను కూడా భీమ్లా నాయక్ చాలా ఈజీగా వేగంగా బ్రేక్ చేస్తుండడం విశేషం. ఈ సినిమాలో రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్ మొదటి సారి నటిస్తున్నారు అనగానే మొదటి నుంచి సినిమాకు భారీ స్థాయిలో బజ్ అయితే వచ్చేసింది. దానికితోడు త్రివిక్రమ్ సినిమాలు డైలాగ్స్ అందించడం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో అయితే సరికొత్త సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటివరకు అత్యధిక వేగంగా 800K లైక్స్ అందుకున్న నెంబర్ టాలీవుడ్ ట్రైలర్ గా రికార్డును క్రియేట్ చేసిందిమ్ ఇంతకుముందు పుష్ప సినిమా మా 19:49నిమిషాల్లో రికార్డును అందుకోగా వకీల్ సాబ్ 13 గంటల 15 నిమిషాల్లో ఆ రికార్డ్ ను అందుకుంది. ఇక RRR సినిమా నాలుగు గంటల 12 నిమిషాల లో ఎనిమిది వందల లైక్స్ సాదించగా ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ గంట 56 నిమిషాల్లోనే భీమ్లా నాయక్ ట్రైలర్ అత్యధిక వేగంగా 800 లైక్స్ సాధించింది.

చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా అత్యధిక వేగంగా 100 కోట్ల వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు అక్కడ కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నిర్మాతలకు భారీ స్థాయిలో అందించే అవకాశం ఉంటుంది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!


బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus