గోపీచంద్ కి (Gopichand) ఈ మధ్య హిట్లు లేవు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన (Ramabanam) ‘రామబాణం’ కూడా నిరాశపరిచింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని కన్నడ టాప్ డైరెక్టర్ (Harsha) ఎ.హర్ష తో ‘భీమా’ అనే సినిమా చేశాడు. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్.. కాకపోతే కొంచెం సోసియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమా. గోపీచంద్ సరసన (Malvika Sharma) మాళవిక శర్మ, (Priya Bhavani Shankar) ప్రియా భవానీ శంకర్.. లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ బ్యానర్‌పై కెకె రాధామోహన్ (K. K. Radhamohan) ఈ చిత్రాన్ని నిర్మించారు.
గతంలో ఇదే బ్యానర్లో (Pantham) ‘పంతం’ అనే సినిమా చేశాడు గోపీచంద్. అది అతనికి ల్యాండ్ మార్క్ మూవీ. అంటే 25 వ సినిమా అనమాట. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అది సక్సెస్ కాలేదు. యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. దీంతో ‘భీమా’ సినిమాకి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. ఒకసారి ‘భీమా’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 3.40 cr |
సీడెడ్ | 1.35 cr |
ఆంధ్ర(టోటల్) | 4.20 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 8.95 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.70 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 10.65 cr |
‘భీమా’ (Bhimaa) చిత్రానికి రూ.10.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే తప్ప టార్గెట్ అందుకోవడం కష్టం. గతంలో గోపీచంద్ నటించిన సినిమాలు రూ.20 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అతను ఫామ్లో లేడు.
భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!