Pawan Kalyan: పవన్ తో సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన ‘రావణాసుర’ దర్శకుడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ‘వినోదయ సీతమ్’ రీమేక్ లో భాగంగా తన పార్ట్ షూటింగ్ ని కంప్లీట్ చేశాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘దేవర’ ‘నేను కాలాన్ని’ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ప్రాజెక్టుని కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు.

ఆ చిత్రం మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక సుజిత్ దర్శకత్వంలో చేయాల్సిన మూవీ షూటింగ్ ను కూడా మొదలుపెడతాడు. అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమా సంగతేంటో ఎవ్వరికీ తెలియడం లేదు. ఇదిలా ఉండగా.. ‘రావణాసుర’ దర్శకుడితో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల టాక్ వినిపించింది. కానీ దాని పై ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ‘రావణాసుర’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న సుధీర్ వర్మ తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు.

‘త్రివిక్రమ్ గారి కథతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు హీరోగా ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే అది ఎప్పుడు ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది’ అంటూ సుధీర్ వర్మ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. సుధీర్ వర్మ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ .. ‘స్వామిరారా’ తప్ప ఇంకేమి లేదు. ‘కేశవ’ సినిమా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. మరి ఈ కాంబో ఎలా సెట్ అయ్యింది అనే డౌట్ అందరిలోనూ ఉంది. సుధీర్ వర్మ- త్రివిక్రమ్ ల సొంత ఊరు భీమవరం.

బహుశా.. ప్రాంతీయ అభిమానం మీద సుధీర్ వర్మకి పవన్ తో పనిచేసే అవకాశం త్రివిక్రమ్ ఇచ్చి ఉండొచ్చని కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే సుధీర్ వర్మ.. పవన్ తో చేసేది త్రివిక్రమ్ ఒరిజినల్ కథతోనా.. లేక రీమేక్ కథ అయ్యి ఉండొచ్చా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి వీరి కాంబోలో మూవీ అయితే ఫిక్స్ అయ్యింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus