Bhola Shankar: మెగాస్టార్‌తో ఈసారి ఎలాంటి స్టెప్పులేయించారో మాస్టర్‌!

చిరంజీవి సినిమాల్లో పెద్దగా హైప్‌ లేకుండా తెరకెక్కుతున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘భోళా శంకర్‌’ అని చెప్పాలి. ఆ సినిమా రీమేక్ అవ్వడం, ఇప్పటికే తెలుగు వెర్షన్‌ చాలామంది చూసి ఉండటం, డైరక్టర్‌.. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అలాంటి హైప్‌ లెస్‌ సినిమా నుండి ఓ అప్‌డేట్‌ వచ్చింది. మాంచి హాట్‌ సమ్మర్‌లో ఇది ఓ కూల్‌ అప్‌డేట్‌ అని చెప్పాలి. సినిమాలో కూల్‌ డ్యూయెట్‌ను అంతకంటే కూల్‌ ప్లేస్‌లో తెరకెక్కించారట.

దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను డైరక్టర్‌ మెహర్‌ రమేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. చిరంజీవి, తమన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. కీర్తి సురేశ్‌.. చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తోంది. సుశాంత్‌ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. సిటీలో సెట్స్‌ వేసి ఓ వైపు చిత్రీకరిస్తుండగా… మరోవైపు విదేశాల్లో పాటలు చిత్రీకరిస్తున్నారు. అలా స్విట్జర్లాండ్‌లో ఓ పాటను కంప్లీట్‌ చేశామని టీమ్‌ తెలిపింది.

శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఈ పాట అద్భుతంగా వచ్చినట్లు టీమ్‌ ప్రకటించింది. మహతి సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కేఎస్‌ రామారావు కూడా నిర్మాణంలో ఓ భాగస్వామి. పాటలో చిరంజీవి డ్యాన్స్‌ చూశాక.. మెహర్‌ రమేశ్‌ ఆసక్తికరంగా స్పందించారు. ఎన్నేళ్లు అయినా సరే మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని మెహర్ రమేష్ కామెంట్‌ చేశారు. ‘ఇంద్ర’ నుండి ‘భోళా శంకర్’ వరకు చిరు స్వాగ్ అలానే కంటిన్యూ అవుతోందని ఆయన చెప్పుకొచ్చారు.

అదేంటి ‘ఇంద్ర’ నుండి లెక్కేస్తున్నారు అనే డౌట్‌ రావొచ్చు. రీసెంట్‌గా చిరంజీవి సినిమాల్లో ‘ఇంద్ర’ సినిమాలో ఓ పాటను స్విస్‌ కొండల్లో తెరకెక్కించారు మరి. ఇక సినిమా సంగతి చూస్తే.. ఆగస్టు 11న ‘భోళా శంకర్’ విడుదల చేస్తామని ఇప్పటికే టీమ్‌ ప్రకటించింది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత ‘భోళా శంకర్’ వస్తుండటంతో ఈ సినిమా విజయం చిరంజీవి, చిరు ఫ్యాన్స్‌కి చాలా అవసరం అనే చెప్పాలి. మరి సరైన విజయం లేని మెహర్‌ రమేశ్‌ (Bhola Shankar) ఈ సినిమాలో చిరంజీవి ఎలా చూపిస్తారో చూడాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus