నేను ప్రేమించిన అమ్మాయి స్వేచ్ఛగా ఉండాలి: మనోజ్

  • March 21, 2023 / 06:45 PM IST

మంచు మనోజ్ భూమా మౌనికను ఈ నెల మూడవ తేదీ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా మనోజ్ మౌనికల వివాహం జరిగిన వెంటనే ఈ దంపతులు పలు దైవదర్శనాలకు వెళ్తూ వస్తున్నారు. ఈ క్రమంలోని వీరి పెళ్లి తర్వాత మొదటిసారి వీరిద్దరూ జంటగా తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్ సమస్థకు వెళ్లారు. ఇలా వీరిద్దరు జంటగా వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వీరికి ఘన స్వాగతం పలికారు.

ఇక మనోజ్ మౌనిక దంపతులు విద్యార్థులకు అభివాదం చేస్తూవారితో కలిసి ఫోటోలు దిగినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ క్రమంలోనే విద్యార్థులను ఉద్దేశిస్తూ మనోజ్ పలు వ్యాఖ్యలు చేశారు. అనంతరం తన భార్య మౌనిక గురించి కూడా మాట్లాడారు.ఇలా మనోజ్ మౌనిక గురించి మాట్లాడటంతో మౌనిక ఒకసారిగా ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు. ఇక మనోజ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… నేను ప్రేమించిన అమ్మాయి ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలి.

తాను కోరుకున్న డ్రీమ్స్ వరకు తను చేరుకోవాలి. ప్రతిమగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు అలాగే ప్రతి ఆడది విజయం వెనుక మగాడు ఉండాలని నేను కోరుకుంటున్నాను తను చేసే ప్రతి పనిలోనూ నా సపోర్ట్ ఉంటుంది అంటూ మనోజ్ మాట్లాడారు. ఇలా మనోజ్ మాట్లాడటంతో మౌనిక ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తన తండ్రి మోహన్ బాబు గురించి కూడా ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడారు. మా నాన్నగారు నాకు విలువ కట్టలేనంత ప్రేమను ఇచ్చారు.

నేను వందసార్లు ఆయనని గాయపరిచిన ఆయన మాత్రం ప్రేమనే పంచారు. నాన్న నేను ఒక అమ్మాయికి జీవితాంతం తోడు ఉంటానని మాట ఇచ్చానని నాన్నకు చెప్పగానే నాన్న నా అభిప్రాయాన్ని నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తెలిపారు.మౌనికకు తల్లిదండ్రులు లేరనే విషయం మీకు తెలిసిందే. కానీ నాన్న మాత్రం మౌనిక నా మూడో కూతురు అంటూ చెప్పారు. ఇలా తాను ఎన్ని జన్మలెత్తినా తన తండ్రి రుణం తీర్చుకోలేనని ఈ సందర్భంగా మనోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus