కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది తమ సొంత ఊర్లకు చేరుకున్నారు. మరికొంత మంది అయితే ఎలాగైనా సొంత ఊర్లకు వెళ్ళిపోతాం అని పోలీసులను బ్రతిమాలుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాన మంత్రి మోడీ ప్రకటించినట్టు తెలంగాణలో కూడా ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కె.సి.అర్ తెలిపారు. ఇదిలా ఉంటే… కరోనా వల్ల దెబ్బ తిన్న వారందరికీ తమ వంతు సహాయం చేయడానికి మన టాలివుడ్ స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారు.
పవన్, మహేష్, చరణ్, ఎన్టీఆర్, వంటి హీరోలు… త్రివిక్రమ్, కొరటాల ,సుకుమార్, అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్ లు కూడా తమ వంతు సాయం చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఇక ప్రభాస్ , అల్లు అర్జున్ వంటి వారు కూడా భారీగానే విరాళాలు అందించారు. ప్రభాస్ 4 కోట్లు ప్రకటించాడు… ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి 1కోటి రూపాయలు, ఇక సెంట్రల్ కు 3 కోట్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఇక బన్నీ కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు కూడా కలిపి 1.25 కోట్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.
దీంతో వీరి అభిమానులు కాలర్ ఎగిరేసుకుని తిరుగుతున్నప్పటికీ కొందరు మాత్రం సెటైర్ లు వేస్తున్నారు. బాలీవుడ్ లో ఫాలోయింగ్ పెరిగింది కాబట్టి దానిని ఇంకా పెంచుకోవాలని ప్రభాస్ … సెంట్రల్ కు ఏకంగా 3 కోట్లు ఇచ్చాడని… ఇక బన్నీకి కూడా మలయాళం లో ఫాలోయింగ్ ఉంది .. కాబట్టి ఆ పక్షపాతంతోనే ఇలా అటువైపు కూడా డొనేట్ చేస్తున్నారని కామెంట్లు వినపడుతున్నాయి. అయితే చేసే మంచి లో కూడా ఇలాంటివి లెక్క వేయకూడదు అని వారు ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి.