బెల్లంకొండకి నిరాశ తప్పదా..?

కరోనా సమయంలో థియేటర్ వ్యవస్థ, సినిమా ఇండస్ట్రీ ఎంతగా ఎఫెక్ట్ అయ్యాయో తెలిసిందే. ఆ తరువాత మెల్లగా కోలుకుంటున్నట్లే కనిపించాయి. ఓటీటీ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలను థియేటర్లకు రప్పించడం కోసం నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలు చాలా కష్టపడుతున్నాయి. మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్ ఈ విషయంలో ఛాలెంజెస్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. కరోనా తరువాత బాలీవుడ్ లో చాలా సినిమాలే విడుదలయ్యాయి. అందులో ఎన్ని హిట్స్ అనుకున్నాయో వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.

మహా అయితే నాలుగైదు హిట్స్ మాత్రమే ఉన్నాయి. అంతకుమించి ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది. అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ ఇలా చాలా మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కానీ ఏ సినిమాకి కూడా సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. రీసెంట్ గా విడుదలైన ‘షంషేరా’ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. అసలు ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు దర్శకనిర్మాతలు.

ఇంతకముందు సౌత్ సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్స్ కొట్టేశారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. కానీ ఇప్పుడు ఈ స్ట్రాటజీ కూడా వర్కవుట్ కావడం లేదు. ‘జెర్సీ’, హిట్’ లాంటి సినిమాలు హిందీలో రీమేక్ అయి నెగెటివ్ టాక్ తెచ్చుకున్నారు. ఇలాంటి సమయంలో ‘ఛత్రపతి’ రీమేక్ తో ఆడియన్స్ ను అలరించాలనుకుంటున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. దీనికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

వీరిద్దరికీ బాలీవుడ్ ఇది డెబ్యూ ఫిల్మ్. డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఆడియన్స్ ని అలరించిన బెల్లంకొండ.. స్ట్రెయిట్ ఫిల్మ్ తో హిట్ కొట్టాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇలాటి సమయంలో ‘ఛత్రపతి’ రీమేక్ తో చిత్రబృందం ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి!

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus