‘బాహుబలి'(సిరీస్) వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని మొదలుపెట్టినప్పుడు రాజమౌళి ప్లానింగ్ మామూలుగా లేదు. ముందుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం సెట్లో ఓ స్కూల్ వాతావరణాన్ని తీసుకొచ్చాడు. ప్రతీ క్యారెక్టర్ డిజైన్ చెయ్యడానికి డ్రాయింగ్ టీంను ఏర్పాటు చేసాడు. అందుకోసం ప్రత్యేక గదిని కేటాయించాడు. తరువాత షూటింగ్ మొదలుపెట్టడానికి ముందు ప్రతీ ఒక్కరికీ క్లాసులు పెట్టాడు. పీరియాడికల్ నేపధ్యం కలిగిన సినిమా కాబట్టి.. ఆర్టిస్ట్ లకు డైలాగులు ముందుగానే రాసి ఉన్న పేపర్లను ప్రభాస్, రానా, అనుష్క వంటి నటీనటులకు ఇచ్చి చదివించాడు. తరువాత పరీక్షలు కూడా నిర్వహించాడు.
అందులో ఫెయిల్ అయినవాళ్లకు.. బ్యాకప్ క్లాసులు కూడా పెట్టాడు. అవన్నీ పూర్తయ్యాక వాళ్లకు ఐడి కార్డులు కూడా ఇచ్చాడు. రాజమౌళి డెడికేషన్ అలాంటిది మరి. సరిగ్గా మన లెక్కల మాష్టారు సుకుమార్ కూడా అంతే..! క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడడు దర్శకుడు సుకుమార్. ఈ సంగతి ‘1 నేనొక్కడినే’ ‘రంగస్థలం’ చిత్రాలతో ప్రూవ్ అయ్యింది. ఇప్పడు ‘పుష్ప’ విషయంలో కూడా అదే పద్దతిని ఫాలో అవుతున్నాడట. ఈ చిత్రం కథ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందట.
ఈ చిత్రంలో నటించే నటీనటులందరూ చిత్తూర్ స్లాంగ్ లో మాట్లాడాల్సి ఉంటుందట. తెలుగు పూర్తిగా రాని రష్మిక కూడా అంతే..! అందుకే చిత్తూర్ స్లాంగ్ నేర్పే ఒక ట్రైనర్ ను పెట్టి.. ఆన్లైన్లో క్లాసులు చెప్పిస్తున్నాడట సుకుమార్. ఈ క్లాసులు పూర్తయ్యాక పరీక్షలు కూడా పెట్టబోతున్నాడట సుకుమార్. అందులో క్వాలిఫై అవ్వకపోతే వాళ్లకు మళ్ళీ బ్యాకప్ క్లాసులు చెప్పిస్తాడట. పాపం ‘పుష్ప’ టీం..!