ప్రపంచ దేశాల్లోని అతిపెద్ద స్ట్రీమింగ్ సంస్థల్లో అమెజాన్ ప్రైమ్ ఒకటి. అమెజాన్ ప్రైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని పెద్ద సినిమాలతో పాటు మిడిల్ రేంజ్ హీరోల సినిమాలను సైతం కొనుగోలు చేస్తుండటం గమనార్హం. తెలుగు సినిమాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్న ఓటీటీ ఏదైనా ఉందా అంటే ఆ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ అనే చెప్పాలి. అయితే థియేటర్లలో రిలీజ్ చేయకుండా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు సినిమాలను రిలీజ్ చేస్తే మాత్రం ఆ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి.
గతేడాది నిశ్శబ్దం, వి సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో విడుదలై డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకున్నాయి. వి సినిమా రిజల్ట్ వల్ల నాని టక్ జగదీష్ సినిమాకు 45 కోట్ల రూపాయల ఓటీటీ ఆఫర్ వచ్చినా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. నిశ్శబ్దం సినిమా రిజల్ట్ వల్ల అనుష్క సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అనుష్క కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఆమె ఫ్యాన్స్ కు సైతం అర్థం కావడం లేదు. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో నారప్ప సినిమా విడుదలైంది.
వి, నిశ్శబ్దం స్థాయిలో కాకపోయినా నారప్ప సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. థియేటర్లలో నారప్ప విడుదలై ఉంటే బిలో యావరేజ్ రిజల్ట్ ను అందుకుని ఉండేది. ప్రైమ్ లో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే చిన్న సినిమా మాత్రమే హిట్టైంది. అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు సైతం ఇకపై భారీ మొత్తం ఖర్చు చేసి సినిమాలు కొనుగోలు చేసే ముందు జాగ్రత్త పడే అవకాశం ఉంది. పెద్ద సినిమాల ఫలితాలు ప్రైమ్ నిర్వాహకులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.