Bigg Boss Telugu 6: కెప్టెన్సీ పోటీదారులు వీళ్లే..! టాస్క్ లో ఈరోజు జరిగింది ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో పాము నిచ్చెనల టాస్క్ పూర్తి అయ్యింది. ఇందులో హౌస్ మేట్స్ అందరూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. ముఖ్యంగా ఇనయ ఇంకా ఫైమా ఇద్దరూ బుసలు కొట్టే పాముల్లా కొట్లాడుకున్నారు. అయితే, పాముల టీమ్ సంచాలక్ గా ఉన్న ఫైమా ఇనయని గేమ్ నుంచీ అవుట్ చేసింది. అలాగే, ఇనయ పాముల టీమ్ లో వాసంతీని అవుట్ గా ప్రకటించింది. దీంతో సెకండ్ లెవల్లో వాసంతీ, ఇంకా ఇనయ అవుట్ అయ్యారు. అయితే, బిగ్ బాస్ పాము నిచ్చెనల టాస్క్ లో ఓడిపోయిన వారికి మరో అవకాశం ఇచ్చాడు.

రోహిత్, శ్రీసత్య , ఫైమా, ఇంకా ఇనయలకి స్టికరింగ్ టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఒకరి టీషర్ట్ పై మరొకరు స్టిక్కర్స్ అంటించాలి. ఇలా ఎవరి టీషర్ట్ కి అయితే తక్కువ స్టిక్కర్లు అంటుకుని ఉంటాయో వాళ్లు పోటీదారుల రేస్ లో ఉంటారు. ఫస్ట్ రౌండ్ లో ఇనయ గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ నుంచీ బయటకి వెళ్లిపోయింది. దీంతో మొదట్లోనే ఇనయ గేమ్ నుంచీ అవుట్ అయ్యిపోయింది. ఆ తర్వాత వాసంతీ కూడా గేమ్ నుంచీ అవుట్ అయినట్లుగా సమాచారం. మరోవైపు శ్రీహాన్ ని వీకండ్ నాగార్జున కెప్టెన్సీ పోటీదారులుగా ఒకవారం నిషేదించిన సంగతి తెలిసిందే.

అందుకే, శ్రీహాన్ కూడా తప్పుకున్నాడు. దీంతో మిగిలిన వారికి నాగమణి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో బుట్టలో నాగమణిలాంటి వజ్రాలని దాచుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎవరైతే ఎక్కువగా దాచుకుని ఉంటారో వాళ్లు గేమ్ లో ముందుకు వెళ్తారని చెప్పాడు బిగ్బాస్. ఈ టాస్క్ లో రేవంత్, ఆదిరెడ్డి, ఇంకా కీర్తి , ఫైమాలు ఎగ్రెసివ్ గా ఆడినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక ఈ టాస్క్ లో పోరాడి మొత్తం ఎనిమిదిమంది ఈవారం కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు.

వీళ్లలో శ్రీసత్య, మెరీనా, వాసంతీ, ఫైమా లతో పాటుగా ఆదిరెడ్డి, రోహిత్ ఇంకా శ్రీహాన్ ఉన్నారు. కానీ, శ్రీహాన్ కి నాగార్జున పనిష్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఎలా పోటీదారుడు అయ్యాడు అనేది తెలియాల్సి ఉంది. నిజంగా ఈవారం బిగ్ బాస్ ఆటలో చూస్తే అందరికంటే రేవంత్ గేమ్ బాగా ఆడాడు. అలాగే బాలాదిత్య కూడా ఎక్కువ మట్టిని కలక్ట్ చేసుకుని నిచ్చెన కట్టడంలో విజయం సాధించాడు. మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఈ టాస్క్ లో బాగా ఆడారు. అయితే, శ్రీహాన్ ఉన్నట్లుండి పోటీదారుడు అయ్యాడు.

ఇక బిగ్ బాస్ పాము నిచ్చెనల టాస్క్ లో ట్విస్ట్ ఇచ్చాడా.? కేవలం హౌస్ మేట్స్ కోసమే ఈటాస్క్ నడిపించాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాము టీమ్ లో ఉన్నవాళ్లు, అలాగే నిచ్చెన టీమ్ లో ఉన్నవాళ్లు ఎవరు పోటీదారులు అయ్యారు ? ఈ టాస్క్ లో గెలిచింది ఎవరు ? అనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఈ టాస్క్ వల్ల ఉపయోగం లేనపుడు అసలు ఎందుకు బిగ్ బాస్ ఈ టాస్క్ పెట్టాడు అని కూడా బిగ్ బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus