ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని చిత్ర పరిశ్రమలు కరోనా వైరస్ కారణంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుండగా టాలీవుడ్ కూడా గడ్డు కాలంలో ఉంది. కరోనా నివారణలో భాగంగా చాల థియేటర్స్ ని ప్రభుత్వాలు మూసివేయించాయి. అడపాదడపా ఉన్నా.. జనాలు సినిమాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక పూర్తయిన సినిమాల విడుదల ఆగిపోగా, కొత్త సినిమాలు షూటింగ్స్ నిలిపివేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితి.
ఇక రానున్న రోజులలో టాలీవుడ్ లో గందర గోళ పరిస్థితి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమాల విడుదల ఆపివేయడం ద్వారా భవిష్యత్తులో అనేక చిత్రాలు ఒకేసారి విడుదల కావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందరూ ఒకే సారి సినిమాలు విడుదల చేస్తే థియేటర్స్ సమస్య నెలకొనే ప్రమాదం ఉంది. కాబట్టి పరిస్థితి చక్కబడినప్పటికీ భవిష్యత్తులో సినిమాల విడుదల విషయంలో గందర గోళ పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో రానా నటించిన అరణ్య, అనుష్క నిశ్శబ్దం, నాని ‘వి’ మరియు నాగ చైతన్య లవ్ స్టోరీ వంటి చిత్రాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. రేపు కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ చిత్రాల నిర్మాతలు విడుదల చేయడానికి పోటీపడతారు. దీనితో పోటీ పెరిగి థియేటర్స్ విషయంలో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక అందరూ ఒకే సారి రావడం వలన అది కలెక్షన్స్ పై ప్రభావం చూపుతుంది. కాబట్టి మును ముందు టాలీవుడ్ లో సినిమాల విడుదల విషయంలో గందరగోళం నెలకొనే తీరు కనిపిస్తుంది.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్