“అసలు ఇలాంటి షోలు జనాలు చూస్తారా?” అనే ప్రశ్న నుంచి “ఏం చూశార్రా బాబు జనాలు?” అని అందరూ ఆర్చర్యపోయే స్థాయిలో సూపర్ హిట్ అయిన “బిగ్ బాస్” సీజన్ విజయంలో వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ కీలకపాత్ర ఎంత అనేది అందరికీ తెలిసిందే. అలాంటి సక్సెస్ ఫుల్ షో సెకండ్ సీజన్ కి ఎన్టీఆర్ ఒప్పుకోకపోవడంతో అతడి స్థానంలో నానీని తీసుకొన్నప్పట్నుంచి భిన్నమైన వాదనలు వ్యక్తమయ్యాయి. నెగిటివ్ అనేది రావడం సర్వసాధారణం కాబట్టి ముందు ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. నిన్న మొదలైన “బిగ్ బాస్ 2” షోను నాని హోస్ట్ చేసిన విధానం చాలా పేలవంగా ఉందని, ఎన్టీయార్ లో కనీసం సగం కూడా నాని చేయలేకపోయాడు. ముఖ్యంగా ఏ ఒక్క కంటెస్టెంట్ తోనూ సరిగా ఇంటరాక్ట్ అవ్వలేకపోయాడు అలాగే.. ఆడియన్స్ ను కూడా ఎంగేజ్ చేయలేకపోయాడు. నాని హోస్టింగ్ కంటే కంటెస్టెంట్స్ ఆడియో విజువల్స్ బాగున్నాయని మీమ్స్ వచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు.
ఇక మొదటి సీజన్ లో మంచి మంచి సెలబ్రిటీస్ సందడి చేయడంతో.. సీజన్ 2 అంతకు మించి ఉంటుంది అని ఆశించినవారి ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఒక్క తేజస్వి మడివాడ, బాబు గోగినేని మినహా మిగతావారందరందరికీ సెలబ్రిటీ హోదా ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఏమాత్రం ఆసక్తి పుట్టించలేని పర్సన్స్ వాళ్ళంతా. సో, కర్టెన్ రైజర్ షో అయితే హోస్టింగ్ పరంగా, కంటెస్టెంట్స్ పరంగా ఫెయిల్ అనే చెప్పాలి. మరి రానున్న సీజన్స్ ఏమైనా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఒకే లేదంటే మాత్రం ఈ సీజన్ ఫ్లాప్ గా మిగిలిపోతుంది.