బిగ్ బాస్: మెహబూబ్‌కు అమ్మ రాజశేఖర్‌ భలే పంచ్‌!

బిగ్‌బాస్‌లో ఈ రోజు అదిరిపోయే వినోదం పండబోతోందా? ప్రోమోలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ‘బ్లాక్‌బస్టర్‌…’ సాంగ్‌తో మొదలైన డేలో ‘అత్త.. అల్లుడు.. అమెరికా మోజు’ సీరియల్‌ చూపించబోతున్నారు. అందులో నటీనటులు మనకు తెలిసినవాళ్లే. అదేనండి బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్సే. ఒక్కో పార్టిసిపెంట్‌కు ఒక్కో క్యారెక్టర్‌ ఇచ్చి నటించమన్నాడు బిగ్‌బాస్‌. తీరా చూస్తే వాళ్లందరూ జీవించేసినట్లున్నారు. ఇదంతా చూస్తే ఈ రోజు ఎపిసోడ్‌ ‘బ్లాక్‌బస్టర్‌’ అయ్యేలా ఉంది. పూల్‌ దగ్గర అందరూ బ్లాక్‌బస్టర్‌ ట్రేడ్‌మార్క్‌ స్టెప్పు వేస్తుంటే…

ఇంట్లో మోనాల్‌, అమ్మ రాజశేఖర్‌ అదిరిపోయే హిప్పు స్టెప్పేస్తూ కనిపించారు. ఆ తర్వాత దివిని ఎత్తుకొని ఇంట్లో ఆ చివరి నుంచి ఈ చివరకు షారుఖ్‌ ఖాన్‌ స్టైల్‌లో ఎత్తుకొచ్చాడు మెహబూబ్‌. ఆమె ఒక్కరినేనా అంటే అంతకుముందే ఆరియానాను, హారికను కూడా ఎత్తుకున్నాడట. దీనిని చూసి అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ మెహబూబ్‌కు దమ్ముంటే ‘కళ్యాణిని ఎత్తుకోమని’ సవాలు విసిరాడు. దానికి మెహబూబ్‌ ‘నా వల్ల కాదు బాబోయ్‌..’ అంటూ పారిపోయాడు.

ఆ తర్వాత ‘అత్త.. అల్లుడు.. అమెరికామోజు’ సీరియల్‌ను ప్రసారం చేశారు. అదేనండి ఆ సీరియల్‌ను నటించి చూపించారు. ‘నీరజాలగలరా… ’ అంటూ కళ్యాణి గొంతు సవరించుకునేసరికి అమ్మ రాజశేఖర్‌ ‘వామ్మో’ అంటూ భయపడిపోయాడు. ఊళ్లో ఇంటింటి రామాయణాన్ని ఈ సీరియల్‌లో చూపిస్తున్నట్లున్నారు. హారిక, నోయల్‌ ఓ జంట కాగా.. దేవి, కుమార్‌ సాయి మధ్య ఏదో అఫైర్‌ నడుస్తోంది. లాస్య, మోనాల్‌ తల్లీకూతుళ్లుగా నటిస్తున్నారు. మోనాల్‌ పెళ్లి చేసుకోవడానికి అమ్మ రాజశేఖర్‌ విదేశాల నుంచి వచ్చాడు. దివితో పులిహోర కలపడానికి వచ్చిన అఖిల్‌కి ‘పులిహోర’ అంటే ఏంటో తెలియదంట. ఇలా ఎవరికివారు ఫన్‌ పండించారు. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి.


ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus