బిగ్ బాస్ 4: గెలిచేది ఎవరు..? నిలిచేది ఎవరు..?

బిగ్ బాస్ హౌస్ లో దెయ్యాల టాస్క్ అయిన తర్వాత బిగ్ బాస్ రేస్ టు ఫినాలే టాస్క్ ని పెట్టాడు. ఇక్కడే ఇప్పటి వరకూ అయిన కెప్టెన్స్ లో నుంచి ఒక వరెస్ట్ కెప్టెన్ ని, బెస్ట్ కెప్టెన్ ని ఎంచుకోమని చెప్పాడు బిగ్ బాస్. దీంతో పార్టిసిపెంట్స్ మద్యలో ఆర్గ్యూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది.

రేస్ టు ఫినాలే అనేసరికి అందరూ తమకి తాము బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అరియానా గురించి సోహైల్ వరెస్ట్ కెప్టెన్ అని, బాగా టార్చర్ చేసిందని చెప్తూనే నేను బెస్ట్ కెప్టెన్ అని చెప్పాడు. అలాగే, అఖిల్ తను చాలా అనూహ్యంగా కెప్టెన్ అయ్యానని, ఇది చాలా కష్టమైన ప్రక్రియ అని చెప్పుకొచ్చాడు.

మళ్లీ అభిజిత్ కి , అఖిల్ కి పాత కథ మొదలైంది. మధ్యలో దూరిన సోహైల్ ని గట్టిగా వారించాడు అఖిల్. అంతేకాదు, అభిజిత్ మళ్లీ తన మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. అయితే, ఇందులో ఎవరు అర్హత సంపాదించారు. ఎవరు గెలిచారు.. ? ఎవరు ఫినాలే రేస్ లో నిలిచారు అనేది ఆసక్తికరం.

ప్రస్తుతం మాటివి రిలీజ్ చేసిన ఈ ప్రోమో అత్యధిక లైక్స్ తో దూసుకుపోతోంది.


బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus