బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: స్టెప్పులు… బొమ్మలు.. ఎలిమినేషన్‌.. వైల్డ్‌ కార్డు!

బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో ఒక వారం ముగిసింది. సూర్యకిరణ్‌ను ప్రేక్షకులు తక్కువ ఓట్లతో తిరస్కరించడంతో ఆయన ఇంటి నుండి బయటకు వచ్చేశారు. అంతకుముందు ఎప్పటిలాగే సండే.. ఫన్‌డేను నాగార్జున కండక్ట్‌ చేశాడు. ఇంకా ఈ రోజు ఏం జరిగాయంటే?

* ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘రాములో రాముల..’ పాటతో నాగ్‌ ఈ రోజు ఎంట్రీ ఇచ్చాడు. పాటలో ఫేమస్‌ దోశ స్టెప్పును డ్యాన్సర్లతో నాగ్‌ వేయడం సింప్లీ సూపర్బ్‌. నిన్న బ్లూ అండ్‌ బ్లూలో వచ్చిన నాగ్… ఈ రోజు బ్లాక్‌ అండ్ బ్లాక్‌లో చితక్కొట్టాడు.

* ఇంట్లోంచి బయటకు వెళ్లేవారిని ఆనందంగా పంపేలా… ఈ రోజు ఆట, పాటల్ని నిర్వహించాడు బిగ్‌బాస్‌. గార్డెన్‌ ఏరియాలో బాయ్స్‌ అండ్‌ గాళ్స్‌ జుగల్బందీ నిర్వహించారు. ప్రతిపాటకు ఒక బాయ్‌, గాళ్‌ డ్యాన్స్‌ చేశారు.

* మెహబూబ్‌, మోనాల్‌ ‘జిగేల్‌ రాణి…’ పాటకు స్టెప్పులేశారు. మోనాల్‌కు అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ 6 మార్కులు ఇవ్వగా, నాగ్‌ 7 మార్కులు ఇచ్చారు. మెహూబూబ్‌కి నాగ్‌, రాజశేఖర్‌ 9 మార్కులు ఇచ్చారు.

‘చల్‌ మోహన్‌రంగా…’ పాటకు కళ్యాణి, సోహైల్‌ డ్యాన్స్‌ వేశారు. అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ కళ్యాణికి మాస్టర్‌ 7, సోహైల్‌ 6 మార్కులు ఇచ్చారు. కళ్యాణికి నాగ్‌ 9 మార్కులు ఇవ్వగా, సోహైల్‌కి 7 ఇచ్చారు.

‘సున్‌ సున్‌ యారో లవ్‌ సోల్జర్‌..’ పాటకు హారిక వేసిన స్టెప్పులకు నాగ్‌, రాజశేఖర్‌ చెరో 8 మార్కులు ఇచ్చారు. అదే పాటకు బాయ్స్‌ టీమ్‌ నుండి వచ్చి డ్యాన్స్‌ వేసిన నోయల్‌కు కూడా అన్నే మార్కులు ఇచ్చారు.

‘మెరిసే మెరుపా…’ పాటకు దేవి నాగవల్లి, ఈ వారం టాప్‌ అభిజిత్‌ స్టెప్పులేశారు. అభిజిత్‌కు 6 మార్కులు ఇచ్చిన అమ్మ రాజశేఖర్‌… దేవికి 8 ఇచ్చారు. నాగ్‌ కూడా దేవికి 8 మార్కులు ఇచ్చి, అభిజీత్‌కు 7 మార్కులు ఇచ్చారు.

‘మైండ్‌బ్లాక్‌…’ పాటకు వేసిన డ్యాన్స్‌కు గాను దివి మొత్తం 16 మార్కులు సాధించింది. ఇందులో నాగ్‌ 8 వేయగా, రాజశేఖర్‌ 8 మార్కులు ఇచ్చారు. అఖిల్‌ అయితే 12 మార్కులు సాధించాడు. ఇందులో నాగ్‌వి 7, రాజశేఖర్‌వి 5.

సూర్యకిరణ్‌, లాస్య ‘నక్కిలీసు గొలుసు’ పాటకు స్టెప్పులేశారు. లాస్యకు అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌, నాగ్‌ చెరో 7 మార్కులు ఇచ్చారు. సూర్యకిరణ్‌కి నాగ్‌, రాజశేఖర్‌ 8 మార్కులు ఇచ్చారు.

ఆఖరిలో గంగవ్వ, అమ్మ రాజశేఖర్‌ మధ్య ఫ్రెండ్లీ కాంపిటీషన్‌ పెట్టారు. ‘అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు’ పాటకు స్టెప్పలేశారు. గంగవ్వ మరోసారి అదరగొట్టేసింది. మొత్తం గాళ్స్‌కి 91 పాయింట్లు రాగా, బాయ్స్‌కు 88 పాయింట్లు వచ్చాయి. అలా గాళ్స్‌ ఈరోజు జుగల్బందీలో గెలిచారు.

* జుగల్బందీ తర్వాత కంటెస్టెంట్‌ను సేఫ్‌ చేయడానికి ఓ పాట వేశారు. ‘అఖిల్‌’లోని టైటిల్‌సాంగ్‌ వేసి అందులో పేరు ఉన్నవారిని సేఫ్‌ చేస్తున్నట్లు నాగ్‌ చెప్పాడు. అలా అఖిల్‌ ఎలిమినేషన్‌ నుండి బయటపడ్డాడు.

* రైమ్స్‌ను ఒక కంటెస్టెంట్‌ పిక్చర్‌ వేస్తే… వాళ్ల పార్టనర్‌ ఆ బొమ్మను చూసి ఆ రైమ్‌ ఏంటో చెప్పాలి.

* మెహబూబ్‌- లాస్య కనెక్షన్‌లో మెహబూబ్‌ ‘చిట్టి చిలకమ్మ…’ రైమ్‌కోసం ఇలా చిలుక బొమ్మ (లాంటిది) వేశాడో లేదా.. లాస్య ఠక్కున చెప్పేసింది.

* ‘జాక్‌ అండ్‌ జిల్‌…’ రైమ్‌ను దివికి వివరించడానికి అమ్మ రాజశేఖర్‌ జాకెట్‌ బొమ్మ వేశాడు. దీంతో అర్థమవ్వడం అటుంచితే నవ్వులు మాత్రం పూశాయి.

* ఆరియానాకు వివరించడానికి సోహైల్‌ ‘బాబా బాబా బ్లాక్‌షీప్‌…’ వేశాడు. దానిని ఆమె అర్థం చేసుకోలేకపోయింది.

* ‘బావ బావ పన్నీరు..’ రైమ్‌ను దేవీకి సూర్యకిరణ్‌ వివరించాల్సి వచ్చింది. దానికి ఆయన వేసిన బొమ్మను అర్థం చేసుకోవడానికి దేవీకి తల ప్రాణం తోకకు వచ్చింది. ఆఖరికి చెప్పలేకపోయింది.

* ‘డింగ్ డాంగ్‌ బెల్‌…’ రైమ్‌ని కళ్యాణికి వివరించడానికి అఖిల్‌ బొమ్మేశాడు. బెల్‌, వెల్‌ బొమ్మలు వేయగానే చెప్పేసింది. ఆ తర్వాత ఆ రైమ్‌ని బుర్రకథ రూపంలో చెప్పింది.

* ‘జానీ జానీ ఎస్‌ పాపా..’ చెప్పడానికి హారిక ప్రయత్నించినా… అభిజీత్‌ వేసిన బొమ్మ అర్థం కాలేదు. అలా వేశాడు మరి మన హీరో.

* మోనాల్‌- సుజాత జోడీకి ‘బుర్రు పిట్ట తుర్రుమన్నది..’ రైమ్‌ వచ్చింది. అయితే మోనాల్‌కు తెలుగు రాని కారణంగా ఆమె బదులు నోయల్‌ వచ్చాడు. పిట్ట బొమ్మ వేయగానే చెప్పేశాడు. దీని తర్వాత ఓ స్కెచ్‌లో మెహబూబ్‌ ఫొటో చూపించి… అతనని నామినేషన్‌ నుండి రిలీఫ్‌ ఇచ్చారు.

* ఎలిమినేషన్ వద్దంటూ… నోయల్‌ ఓ ర్యాప్‌ కూడా పాడాడు. అయితే బిగ్‌బాస్‌.. సీతయ్య కాబట్టి ఎవరి మాటా వినడు అంటూ నామినేషన్‌ పక్రియ పూర్తి చేశాడు నాగ్‌.

* ఇంట్లోకి వచ్చినవారందరికీ తొలుత వాటర్‌ ఇచ్చిన మోనాల్‌కే ఎలిమినేషన్‌ బాధ్యత అప్పగించారు నాగ్‌. ఎవరికి నీళ్లు ఇస్తే.. వాళ్లే ఎలిమినేషన్‌ అని చెప్పారు. ఆమె అర్థమయ్యి, అర్థం కాక సూర్యకిరణ్‌కి ఇచ్చింది. అయితే ఆయనే ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే ఇంట్లో ఉన్నవాళ్లకు నీళ్లు ఇవ్వమన్నారేమో… నేను ఇస్తా అన్నాను. కానీ ఆయన్ని ఎలిమినేట్‌ చేస్తారని ఊహించలేదు అంటూ మోనాల్‌ బాధపడింది.

* సూర్యకిరణ్‌ బయటనే హ్యాపీగానే ఉంటాడు. ఇంట్లో అంత కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నాడు. ఆయన స్టేట్ ఆఫ్‌ మైండ్‌ ఇంకా అంత ఫ్రీగా లేదు. బయటకు వెళ్లైనా ఏదైనా స్క్రిప్ట్‌ రాసుకుంటాడు. మళ్లీ డైరక్టర్‌గా సినిమాలు చేసుకుంటాడు అని అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ కెమెరా ముందు చెప్పాడు.

* నేను ఏమీ తెలియకుండా వచ్చాను. అయితే అన్నీ తెలుసుకున్నా ఇలానే ఉండేవాడిని. షార్ట్‌ జర్నీ నాది. మనసులో ఉన్నది చెప్పే టైప్‌ నేను. ఇంట్లో ఉన్నవాళ్లందరూ పిల్లలు. నాకు కరెక్ట్‌ కాదు. వాళ్లంతా ఓవర్‌ ఎంథూజియాస్టిక్‌. అయితే ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు అందరూ బాధపడ్డారు. అది చాలు అని సూర్యకిరణ్‌ స్టేజీ మీద చెప్పాడు.

* ఇంట్లో ఉన్నవాళ్ల గురించి చెప్పడానికి ఓ గేమ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. ఏ జంతువుకు ఎవరికి రిలేటడ్‌ అని తెలిపే గేమ్‌ అది. అందులో మోనాల్‌ను నెమలితో పోల్చాడు సూర్యకిరణ్‌. గంగవ్వను చీమతో పోల్చాడు సూర్యకిరణ్‌. చిన్న ప్రాణి అయినా మూడు రెట్ల బరువు మోయగల చీమ లాంటిది గంగవ్వ. అంత బాధ, బరువు మోశారు అని పొగిడేశాడు. దేవిని మొసలి అన్నాడు సూర్యకిరణ్‌. మొసలిలా ఎక్కడైనా బతకగలదు.. ఎంతమంది ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసినా ఆమె ప్రభావితం కాదు అని వివరించాడు. కొండను కూడా తొలిచి వెళ్లగల సత్తా ఎలుకది.. అందుకే సోహైల్‌ను ఎలుకతో పోల్చాడు. అయతే తనను తాను ఇంకా మెరుగుపరుచుకోవాలని చెప్పాడు. అభిజిత్‌ను గోడ మీద పిల్లితో పోల్చాడు. పిల్లి నుండి పులి అవ్వడానికి మీరు 70 శాతం ప్రయత్నం పూర్తి చేశారు. మరో 30 శాతం కష్టపడితే పులి అయిపోతారు అనిచెప్పాడు.

ఇక దివిని తాబేలుతో పోల్చాడు ఎలిమినేట్‌ పర్సన్‌. నువ్వు ఉల్టా పడితే గానీ ఎవ్వరూ చంపలేరు. అందుకే కన్‌ఫ్యూజ్‌ కాకుండా జాగ్రత్తగా ఆడమని చెప్పారు. కళ్యాణిని కోతితో పోల్చాడు. ఒక చెట్టు బాగుందని ఉండే మీరు… మరో చెట్టుకు దూకుతారు. అయితే తనలోని అమాయకత్వం కారణమని చెప్పాడు. షార్ప్‌ ఐస్‌ ఉన్న మెహబూబ్‌ను గద్దతో పోల్చాడు సూర్యకిరణ్‌. ఇక హారికను పాముతో పోల్చాడు. పాములో ఉన్న షార్ప్‌ నెస్‌ నీలో ఉంది… దానిని బాగా వాడు అని చెప్పాడు సూర్యకిరణ్‌. శునకం లాంటి విశ్వాసమైన అమ్మాయి సుజాత అని సూర్యకిరణ్‌ పొగిడేశాడు. నోయల్‌ను నక్కతో పోల్చిన సూర్యకిరణ్‌… మంత్రి లాంటి ఆలోచన ఉందని, ఓవర్‌ థింకింగ్‌ అని వివరించాడు.

హౌస్‌లో ఉన్న బాధ్యత ఉన్న లాస్యకు గాడిద అని ట్యాగ్‌ ఇచ్చాడు. అంత బరువు బాధ్యతలు మోయగలగడం లాస్య వల్లనే అని చెప్పాడు. టాస్క్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించిన ఆరియానాకు గుడ్ల గూబ అని పెట్టాడు. అంత నిశితంగా పని చేస్తుందని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇక అఖిల్‌ను దున్నపోతుతో పోల్చాడు. నీతో ఉన్నవాళ్లు నిన్ను ఎలా వాడుతున్నారనేదే ఇక్కడ ముఖ్యం. దానిని మీరే చూసుకోవాలి అని చెప్పాడు. అమ్మ రాజశేఖర్‌ను సింహంతో పోల్చాడు. సింహం అడవికి రాజు. అయితే ఆ రాజు మంచితనాన్ని అందరూ లీనియర్‌నెస్‌గా తీసుకోకుండా చూసుకోండి అని చెప్పాడు.

* ఒక రోజు డ్యూటీ ఫ్రీ అనే బిగ్‌ బాంబ్‌ను దేవి నాగవల్లి మీద సూర్యకిరణ్‌ వేశారు. ఆమె ఇంటికి వచ్చిన రోజు నుండి పని చేస్తూనే ఉన్నారు కాబట్టి ఆమె మీద వేయడమే కరెక్ట్‌ అని చెప్పారాయన. ఆ తర్వాత ఆయన్ని పంపించేశారు.

* అనూహ్యంగా ఈ రోజు వైల్డ్‌ కార్డు ఎంట్రీ కూడా జరిగిపోయింది. కమెడియన్‌గా ఇప్పటికే అందరికీ పరిచయమైన కుమార్‌సాయి అలియాస్‌ సాయికుమార్‌ పంపన ఈ రోజు వైల్డ్‌ కార్డు ఎంట్రీగా వచ్చాడు.

* బిగ్‌బాస్‌లో గెలవాలనే ఆశయంతో వచ్చాను. నేను గెలవకపోయినా బయటికొచ్చే సమయానికి ప్రపంచంలో కరోనా పోయి, వైరస్‌కి వ్యాక్సిన్‌ రావాలనే ఆశ కూడా ఉంది. దర్శకత్వం కోసం రాసుకున్న స్క్రిప్ట్స్‌లో ఒకటి మీరు చెప్పే అవకాశం దక్కుతుందనే ఆశతో వచ్చాను. ఈ మూడింటిలో ఏది జరిగినా నేను గెలిచినట్లే అని కుమార్‌ సాయి చెప్పాడు.

* కాలేజ్‌ టైమ్‌లో నాగార్జునతో తనకున్న అనుబంధం చెప్పాడు కుమార్‌ సాయి. ‘మాస్‌’ సినిమాలో మీ సోల్డర్‌ కట్‌ను మేం కొట్టాలని జిమ్‌కి వెళ్లి ఇలా నాగార్జున లా సోల్డర్‌ కట్‌ కావాలని అడిగాం. రెండు మూడు రోజులు జిమ్‌ చేశాం.. కానీ అలా రాలేదు. దాంతో మా జిమ్‌ ట్రైనర్‌ వచ్చి ‘బాబూ అది హెయిర్‌ కట్‌ కాదు.. చూసి చేయడానికి, రావడానికి. దానికి ఆయన చేసిన కష్టం వేరే ఉంటుంది అని చెప్పాడు. మీకు ఏది వస్తే అది తీసుకోండి అన్నాడు. అయితే అప్పుడు జిమ్‌ స్టార్ట్‌ చేసిన మేం నలుగురు ఫ్రెండ్స్‌ని ఇప్పుడు చూస్తే… ఇంతేసి పొట్టలేసుకున్నారు అంటూ నాటి విషయాలు చెప్పాడు కుమార్‌ సాయి.

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus