అదే ఫార్ములాని అప్లై చెయ్యబోతున్న ‘బిగ్ బాస్’ టీం..!

మొదటి సీజన్ నే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో హోస్ట్ చేయించి తెలుగులో కూడా ‘బిగ్ బాస్’ రియాలిటీ షో పాపులర్ అయ్యేలా చేశారు ‘బిగ్ బాస్’ నిర్వాహకులు. అందుకు తగినట్టే మొదటి సీజన్ జరుగుతున్నప్పుడు వీకెండ్ లో అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యేది. ఆ తరువాత సీజన్ ను 2 ని నాని హోస్ట్ చేశాడు. ఈ సీజన్ కూడా సూపర్ హిట్ అయ్యింది. వీకెండ్ లో నాని హౌస్ మేట్స్ తో మాట్లాడే విధానానికి ఎక్కువ మంది వీక్షించే వారు.

అయితే నాని స్టార్ హీరో కాకపోవడం వల్లో ఏమో కానీ.. అతని పై నెగిటివిటీ ఏర్పడింది. దాంతో మూడో సీజన్ ను మళ్ళీ ఎన్టీఆర్ తోనే హోస్ట్ చేయించాలని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు ట్రై చేసినప్పటికీ.. ‘ఆర్.ఆర్.ఆర్’ వల్ల అది సాధ్యం కాలేదు. దాంతో గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాలిటీ షోని అద్భుతంగా హోస్ట్ చేసిన నాగార్జున అయితేనే కరెక్ట్ అని భావించి అతన్ని ఫిక్స్ చేశారు. వారు భావించినట్టే అద్భుతంగా షోని హోస్ట్ చేసి.. ఎటువంటి వివాదాలు తలెత్తకుండా కూల్ గా హ్యాండిల్ చేశారు నాగార్జున.

అయితే ‘బిగ్ బాస్3’ ని నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు అనే విషయాన్ని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు వెంటనే రివీల్ చెయ్యలేదు. లాస్ట్ కి ఒక ప్రోమో ద్వారా నాగార్జున హోస్ట్ చెయ్యబోతున్నట్టు రివీల్ చేశారు. ఇక సీజన్ 4 కి కూడా హోస్ట్ ఎవరు అన్న విషయాన్ని ఇప్పటి వరకూ ‘బిగ్ బాస్4’ నిర్వాహకులు రివీల్ చెయ్యలేదు.చాలా మంది హీరోల పేర్లు వినిపించినప్పటికీ.. నాగార్జునే ఫైనల్ అయినట్టు టాక్ నడుస్తుంది. ‘బిగ్ బాస్3’కి చేసినట్టే..’బిగ్ బాస్4’ విషయంలో కూడా త్వరలోనే ఓ ప్రోమో ద్వారా హోస్ట్ ఎవరు అనే విషయాన్ని రివీల్ చెయ్యబోతున్నారని సమాచారం.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus