Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 ఫైనల్ టీఆర్‌పీ.. ఎంతంటే?

టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రతిసారి రేటింగ్స్ తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నాగార్జున పోస్ట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ మాత్రం తగ్గకుండా నిర్వాహకులు షోను కొనసాగిస్తున్నారు. ఇక TRP ని అందుకోవడంలో కూడా బిగ్ బాస్ షో ప్రతిసారి ఒక సరికొత్త బూస్ట్ ని ఇస్తోంది అని చెప్పాలి. ముఖ్యంగా ఫైనల్ డే రోజు భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకోవడం విశేషం. కొన్ని పాత రికార్డులు బ్లాస్ట్ అయినప్పటికీ కూడా గత రెండు సీజన్స్ కంటే ఈసారి తక్కువగానే రేటింగ్స్ వచ్చాయి.

బిగ్ బాస్ సీజన్ 1 జూనియర్ ఎన్టీఆర్ తో మొదలైన విషయం తెలిసిందే. ఇక ఆ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ప్రత్యేక అతిథిగా ఎవరు రాకపోయినప్పటికీ 14.13 టిఆర్పి రేటింగ్ తో అప్పటివరకు ఉన్న రియాల్టీ షోల రికార్డులను బ్రేక్ చేసింది. రెండో సీజన్లో నాని హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ సీజన్లో కౌశల్ మండా విజేతగా నిలిచాడు. ఇక బిగ్బాస్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ కు 15.05 టిఆర్పి రేటింగ్ వచ్చింది.

ఇక మూడవ సీజన్ నుంచి అక్కినేని నాగార్జునను హోస్ట్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మూడవ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచిన రాహుల్ మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక ఫైనల్ ఎపిసోడ్ 18.29 టిఆర్పి రేటింగ్ దక్కించుకుంది. నాలుగో సీజన్ కూడా అంతకంటే ఎక్కువగా 19.51 టిఆర్పి రేటింగ్ రావడం విశేషం. ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఫైనల్ ఎపిసోడ్ కురవడంతో మంచి హైప్ ఐతే క్రియేట్ అయింది.

ఇక ఆ సీజన్లో యువ హీరో అభిజిత్ టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఐదవ సీజన్ లో 16.04 టిఆర్పి రేటింగ్ దక్కింది. ఈ సారి ముఖ్య అతిథులుగా ఎవరూ రాకపోవడంతో గతంలో కంటే కొంత తక్కువ బజ్ క్రియేట్ అయింది. ఇక ఐదో సీజన్లో ఎవరు ఊహించని విధంగా వీజీ సన్నీ విజేతగా బిగ్ బాస్ 5 టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus