బుల్లితెరపై ప్రస్తుతం సందడి చేస్తున్న పలు షోల్లో బిగ్ బాస్ షో కి ఆడియన్స్ లో ఒకింత ఎక్కువ క్యూరియాసిటీ ఉందనే చెప్పాలి. మొదట్లో అసలు ఇటువంటి షోలు తెలుగులో ఎంతవరకు నడుస్తాయి అంటూ అనేకమంది సందేహం వ్యక్తం చేసారు. అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 అందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు భారీగా టిఆర్పి రేటింగ్స్ దక్కించుకుంది. ఆ తరువాత నాని హోస్ట్ గా తెరకెక్కిన సీజన్ 2, ఆపై నాగార్జున హోస్ట్ చేసిన 3, 4 సీజన్స్ కూడా ఒకదానిని మించేలా మరొకటి మంచి ఆదరణ రేటింగ్స్ దక్కించుకున్నాయి.
ఇక బిగ్ బాస్ సీజన్ 5 పై మన తెలుగు ఆడియన్స్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ప్రసారమైన ఈ సీజన్ లేటెస్ట్ ప్రోమో అందరిలో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఈ సీజన్ లో పాల్గొనబోయే ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇటీవల బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా వారిలో యాంకర్ రవి, సిరి హన్మంత్, మానస్ షా, నటి ప్రియా, జస్వంత్, సరయు, యూట్యూబర్ షణ్ముఖ్, లహరి షారి, శ్వేతా వర్మ, టివి 9 యాంకర్ ప్రత్యూష, నటుడు విశ్వ, విజె సన్నీ, సీనియర్ నటి ఉమా దేవి, లోబో, ఆర్జే కాజల్ తదితరులు ఈ లిస్ట్ లో ఉన్నారు.
అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ జాబితాలో ఉన్నవారు అందరూ కూడా రేపు షో లో ఉంటారని సమాచారం. ఈ లిస్ట్ ని బట్టి ఈసారి ఎక్కువగా సెలెబ్రిటీస్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇదే ఫైనల్ లిస్టా, లేదా అనేది తెలియాలంటే షో ప్రారంభం వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ లో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది.
* రవి, యాంకర్
* పడాల జశ్వంత్, నటుడు
* సిరి హన్మంత్, నటి
* షణ్ముణ్ జశ్వంత్, యూట్యూబ్ స్టార్
* శ్వేత వర్మ, నటి
* లహరి శ్రీ, నటి
* ఆనీ మాస్టర్, కొరియోగ్రాఫర్
* వీజే సన్నీ,నటుడు
* ప్రియాంక సింగ్, నటి
* ఆర్‌జే కాజల్, యూట్యూబర్
* లోబో, యాక్టర్
* ప్రియ, సీనియర్ నటి
* మానస్, నటుడు
* ఉమాదేవి, సీరియల్ నటి
* దీపక్ సరోజ్, నటుడు
వీళ్లు కాకుండా బ్యాకప్ కోసం మరికొంతమంది బిగ్‌బాస్ టీమ్ సిద్ధం చేసిందట. వారు కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారని సమాచారం.
* వర్షిణి, యాంకర్
* పూనమ్ బజ్వా, నటి
* విశ్వ, నటుడు
* ఆట సందీప్ అతని భార్య జ్యోతిరాజ్
* సరయు, యూట్యూబర్
* నటరాజ్ మాస్టర్, కొరియోగ్రాఫర్
* ప్రియాంక రామన్, నటి
వీరిలో 16 మంది తొలి రోజు బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెడతారని అంటున్నారు. తర్వాత ముగ్గురు వరకు వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అవుతారని సమాచారం. అయితే ఈసారి అలాంటి ఆలోచన లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. మొత్తంగా తొలి రోజే 20 మందిని ఇంట్లోకి పంపిస్తారనే వార్తలూ వస్తున్నాయి.