Bigg Boss: మరోసారి కామన్‌ పీపుల్‌ని పిలుస్తున్న బిగ్‌బాస్‌!

బిగ్‌బాస్‌ అంటే చోటామోటా సెలబ్రిటీలు, ఫేడ్‌ అవుట్‌ అయిపోయిన హీరోయిన్లు, సోషల్‌ మీడియా సెన్సేషన్లు, కాంట్రవర్శీ పీపుల్‌ మాత్రమే ఉంటారు అని అనుకుంటుంటారు. నిజానికి కొన్ని సీజన్లుగా బిగ్‌బాస్‌ ఇలానే నడుస్తోంది. అయితే గతంలో ఓసారి బిగ్‌బాస్‌ ఇంట్లోకి కామన్‌ పీపుల్‌ని పంపించారు. మీరు కూడా చూసే ఉంటారు. అవును, రెండో సీజన్‌లో అనుకుంటా.. అయినా ఇప్పుడెందుకు ఆ విషయం అనుకుంటున్నారా? ఎందుకంటే మళ్లీ బిగ్‌బాస్‌ నుండి కామన్‌ పీపుల్‌కి పిలుపొచ్చింది.

అవును, బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ 6లో సామాన్యులకు పిలుపిచ్చారు నాగార్జున. సామాన్యులకు గోల్డెన్‌ ఛాన్స్‌ అంటూ ఓ ప్రోమో విడుదల చేసింది స్టార్‌ మా – బిగ్‌బాస్‌ టీమ్‌. కామన్‌ పీపుల్‌కి నాగార్జున ఆహ్వానం పలుకుతున్నట్లు ఈ వీడియోను రూపొందించారు. ఇన్నాళ్లూ ఇంట్లో కూర్చుని బిగ్‌బాస్‌ చూశారు, బిగ్‌బాస్‌ ఇంట్లోకి ప్రవేశించే ఆకాశం లాంటి అవకాశాన్ని మీరు కూడా పొందాలనుకుంటున్నారా? అంటూ నాగార్జున వివరాలు చెప్పారు. మరిన్ని వివరాల కోసం starmaa.startv.comలో చూడమని చెప్పారు.

ముందుగా చెప్పినట్లు బిగ్‌బాస్‌ ఇంట్లోకి సాధారణ ప్రజలను పిలవడం ఇదే తొలిసారి కాదు. రెండో సీజన్‌లో నాని హోస్ట్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఫీట్‌ చూశాం. అప్పుడు నూతన్‌ నాయుడు, గణేష్‌ సామాన్యులుగా ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గణేష్ సుమారు 83 రోజులు హౌస్‌లో ఉండి, ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. అయితే, నూతన్ నాయుడు 54వ రోజు బయటకు వెళ్లి, 75వ రోజు వైల్డ్‌ కార్డుగా మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు.

అయితే గణేష్ వెళ్లిన తర్వాతి రోజు అంటే 84వ రోజే నూతన్‌ నాయుడు ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మూడు సీజన్లలో సామాన్యులకు అవకాశం చిక్కలేదు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్‌ కామన్‌ పీపుల్‌ కాన్సెప్ట్‌ను తీసుకొస్తోంది. మరి ఈ సారి ఎవరా అవకాశం దక్కించుకుంటారో చూడాలి. కామన్‌ పీపుల్‌ ఉంటే ఆ మజానే వేరు అని గతంలో మనం చూశాం కదా.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus