నివేదా థామస్ (Nivetha Thomas), వాసుదేవ్ రచ్చకొండ (Vishwadev Rachakonda) ప్రధాన పాత్రల్లో ప్రియదర్శి (Priyadarshi), భాగ్యరాజా, గౌతమి (Gauthami) వంటి వారు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ’35 ..చిన్న కథ కాదు’ (35-Chinna Katha Kaadu). ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఇప్పటివరకు ఫ్యాక్షన్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి. కానీ అదే బ్యాక్ డ్రాప్లో ఓ క్లాస్ సినిమా ఇప్పటివరకు రాలేదు. ఈ సినిమాలో మంచి పాయింట్ ని టచ్ చేసినట్టు ప్రమోషనల్ కంటెంట్ చెబుతుంది. నంద కిషోర్ ఏమని (Nanda Kishore Emani) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
సృజన్ యరబోలు (Srujan Yarabolu), సిద్దార్థ్ రాళ్ళపల్లి (Siddharth Rallapalli ) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. దగ్గుబాటి రానా (Rana Daggubati) ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. వాస్తవానికి ఆగస్టు 15 నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకున్నారు.. కానీ కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 6 కి పోస్ట్ పోన్ చేశారు. అంటే మరో 2 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న మాట. ఇక విడుదలకు వారం రోజుల ముందు నుండి రానా..
ఈ చిత్రాన్ని కొంతమంది సినీ ప్రముఖులకు చూపించడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. ఇది క్లాస్ సినిమా మాత్రమే కాదని.. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని అంటున్నారు. లెక్కల్లో ఎప్పుడూ ఫెయిల్ అయ్యే ఓ పిల్లాడి తల్లిదండ్రులు పడే ఆవేదనని.. ఆ తర్వాత చోటు చేసుకునే పరిస్థితులని ఈ సినిమాలో చాలా నేచురల్ గా చూపించారట. స్క్రీన్ ప్లే చాలా సెన్సిబుల్ గా, యూనిక్..గా ఉంటుంది అంటున్నారు.
ఈ సినిమా చూస్తున్న ఆ 2 గంటల 25 నిమిషాలు.. ప్రతి ఒక్కరూ కూడా తమ స్కూల్ డేస్..ని, ముఖ్యంగా మ్యాథ్స్ క్లాస్..లను, అందులో వచ్చిన మార్కులను నెమరు వేసుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు. మరి సెప్టెంబర్ 6న ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.