బాయ్ ఫ్రెండ్ పై బిగ్ బాస్ బ్యూటీ కంప్లైంట్!

ప్రేమ పేరుతో తనను మోసం చేసి డబ్బు, నగలు తీసుకొని పారిపోయాడని ప్రియుడిపై పోలీస్ కంప్లైంట్ చేసింది తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ జూలీ అమింజికరై అలియాస్‌ మరియా జులియానా. తనకు న్యాయం చేయాలని.. తమిళ నాడు పోలీసులను రిక్వెస్ట్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నా నగర్ కు చెందిన మనీష్, జూలీ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ తనకు మాయమాటలు చెప్పి ఇంట్లో విలువైన వస్తువులను, నగలను తీసుకొని పారిపోయాడని..

జూలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి మనీష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు జూలీపై తిరిగి ఆరోపణలు చేశాడు. జూలీ తనను మోసం చేసిందని.. తనతో రిలేషన్ లో ఉంటూ వేరే వ్యక్తికి దగ్గరైందని మనీష్ చెప్పాడు. కొన్నిరోజులుగా జూలీ తనతో సరిగ్గా మాట్లాడడం లేదని మనీష్ పోలీస్ ఎంక్వయిరీలో వెల్లడించాడు. దీంతో పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇప్పించి కేసు క్లోజ్ చేశారని తెలుస్తోంది.

ఇక జూలీ విషయానికొస్తే.. తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.