ఈ రోజుల్లో పెళ్లి అంటేనే యువత చాలా కంగారు పడిపోయి.. దానికి ఆమడ దూరం ఉంటున్నారు. ఒకవేళ పెళ్ళైనా తొందరగా పిల్లల్ని కనడానికి చాలా మంది దంపతులు ఇష్టపడట్లేదు. సినిమా వాళ్ళ గురించి అయితే ఈ విషయంలో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏకంగా నలుగురు పిల్లల్ని కని హాట్ టాపిక్ అయ్యాడు. విషయంలోకి వెళితే.. ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అయినటువంటి కుమార్ సాయి అలియాస్ కుమార్ సాయి (Kumar Sai) పంపన అందరికీ సుపరిచితమే.
అంతకు ముందు ఇతను మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈరోజుల్లో’ ‘బస్ స్టాప్’ ‘ఈరోజుల్లో’ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఇతనికి పెద్దగా ఛాన్సులు రాలేదు. పలు కారణాల వల్ల ఇతను కొన్నాళ్ల పాటు నటనకు కూడా దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఇతను ప్రభాస్ (Prabhas) – మారుతీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమాలో నటిస్తున్నాడు. మరోపక్క ఇతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు కూడా.
తాజాగా అతను ఓ పోస్ట్ పెట్టాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అదేంటంటే..కుమార్ సాయికి పెళ్లైంది అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. కానీ ఇది నిజం. ఇతనికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా ఇతని భార్య 4వ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కుమార్ సాయి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అలాగే ఒక ఫోటోని కూడా జతచేశాడు. ఇక కుమార్ సాయి పోస్ట్ కి నెటిజన్లు ‘కంగ్రాట్స్’ చెబుతూ వైరల్ చేస్తున్నారు.