Mahesh Vitta Wedding: సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన మహేష్ విట్టా.. వైరల్ అవుతున్న ఫోటోలు

Ad not loaded.

మహేష్ విట్టా అందరికీ సుపరిచితమే.ఓ యూట్యూబర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అతను అనేక షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించాడు. ‘ఫన్ బకెట్’ అనే కామెడీ సిరీస్ అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. చిత్తూర్ స్లాంగ్ లో అతను పలికే డైలాగులు అందరినీ నవ్వించాయి. అందువల్ల అతనికి నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో అవకాశం లభించింది. అటు తర్వాత ‘శమంతకమణి’ ‘టాక్సీ వాలా’ ‘నిను వీడని నీడను నేను’ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ‘ఛలో’ ‘యురేక’ ‘కొండపొలం’ ‘అల్లుడు అదుర్స్’ ‘సకల గుణాభిరామ’ వంటి సినిమాల్లో నటించాడు ఇతను.

‘బిగ్ బాస్’ సీజన్ 3 లో ఓ కంటెస్టెంట్ గా విచ్చేసి దాదాపు 60 రోజుల వరకు హౌస్ లో ఉన్నాడు.’పుష్ప’ సినిమాలో కేశవ పాత్ర మొదట ఇతనికే లభించింది. కానీ కొన్ని కారణాల వల్ల దానిని మిస్ చేసుకున్నాడు మహేష్. ఇదిలా ఉండగా.. మహేష్ ఇటీవల సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అవును సెప్టెంబర్ 2 న శ్రావణి అనే అమ్మాయితో ఘనంగా జరిగింది.

కడప జిల్లాకు చెందిన ప్రొద్దుటూరులోని హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో (Mahesh Vitta) మహేష్ – శ్రావణి ల వివాహం తమ బంధుమిత్రుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. శ్రావణి .. మహేష్ చెల్లెలి ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఆ రకంగా వీరి మధ్య పరిచయం ఏర్పడటం.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగినట్లు తెలుస్తుంది. వీరి పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus