‘పుష్ప2’ సినిమాలో బిగ్ బాస్ భామ!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలా మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. వారికి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఆ విధంగా తమ పాపులారిటీ పెంచుకుంటున్నారు. బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి దివికి కూడా సినిమాలో అవకాశాలు బాగానే వస్తున్నాయి. రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు ‘పుష్ప2’ సినిమాలో దీవిని ఓ పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇందులో ఆమ్ జర్నలిస్టుగా కనిపించనున్నట్లు సమాచారం.

దానికోసం.. దివికి ట్రైనింగ్ కూడా ఇప్పించారట దర్శకుడు సుకుమార్. ఓ పాపులర్ టీవీ జర్నలిస్ట్ తో వర్క్ షాప్ చేయించి .. పాత్ర కోసం దివిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దివి చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద సినిమాలే. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమా ‘పుష్ప2’లో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికొస్తే.. హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేశారు.

ఆ తరువాత చిత్రబృందం రెండు నెలల పాటు బ్యాంకాక్ లో షూటింగ్ పనులు పూర్తి చేసుకొని..తిరిగి వచ్చాక మారేడుమిల్లి అడవుల్లో సినిమాకి సమ్బన్ధంచిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. ప్రస్తుతం హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమా నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఫాహద్‌ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus