Vasanthi: అమ్మో.. బిగ్ బాస్ వాసంతిలో ఈ యాంగిల్ కూడా ఉందా..!

‘బిగ్ బాస్’ రియాలిటీ షో.. 5వ సీజన్ వరకు ఇది సక్సెస్ ఫుల్ షో.! కానీ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ‘బిగ్ బాస్ 6’ మాత్రం ఫెయిల్ అయ్యాయి. అయితే బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయినవాళ్లు సినిమాల్లో రాణిస్తున్న సందర్భాలు చాలా తక్కువ. విజేతలుగా నిలిచిన వాళ్ళు కూడా రాణిస్తుంది ఏమీ లేదు. వాళ్ళు గతంలో ఏం చేసుకున్నారో ఇప్పుడు కూడా అదే చేసుకుంటూపోతున్నారు. అయితే కొంతమంది ఫిమేల్ కంటెస్టెంట్ లు మాత్రం బుల్లితెరపై షోలు అవి చేసుకుంటున్నారు.

హమీదా వంటి భామలు ‘బ్రహ్మముడి’ అంటూ సీరియల్స్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా కాస్త ఎక్కువగా విన్న పేరు వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ బ్యూటీల్లో ఈమె కూడా ఒకరని అంతా భావించారు. ‘బిగ్ బాస్ 6’ ముగిశాక ఈమె గురించి ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడుకుంది లేదు. కానీ తాజాగా బోల్డ్ లిప్ లాక్ లతో ఈమె గ్లామర్ రచ్చ చేస్తుండటం గమనార్హం.

అయితే సోషల్ మీడియాలో అని కాదు లెండి. ఓ సినిమాలో భాగంగా..! వాసంతి ‘గేమ్ ఆన్’ అనే సినిమాలో నటించింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్ సేన్ ఫ్రెండ్ గీతానంద్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తుండగా వాసంతి కృష్ణన్ కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ టీజర్ లో ఎక్కువ హైలెట్ అయ్యింది వాసంతి అనే చెప్పాలి. ఆమెకు సంబంధించిన బోల్డ్ సీన్స్.. ఘాటు లిప్ లాక్ లు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయని తాజాగా విడుదలైన టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. ఆ టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus