బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే కరోనా సమయంలో బిగ్ బాస్ నిర్వాహకులకు కంటెస్టెంట్ లు దొరకడం లేదు. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం ఓ లిస్ట్ ను సిద్ధం చేసుకొని.. వారిలో 16 మందిని ఫైనల్ చేయాలని చూస్తుంది. గతేడాది బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లలో చాలా మంది జనాలకు తెలియదు.
ఆ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అది వేరే విషయం. కానీ ఈసారి కాస్త పేరున్న తారలనే షోలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కుర్ర హీరోలు, క్రేజ్ ఉన్న కమెడియన్స్ ను సంప్రదిస్తున్నారు. అయితే వారి రేంజ్ కి తగ్గట్లుగా రెమ్యునరేషన్ మాత్రం ఆఫర్ చేయడం లేదట. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్ లను ముందుగా అతి తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చారు. కొందరికైతే వేలల్లో ఇచ్చారు.
కానీ షో బాగా క్లిక్ అవ్వడంతో ఆ తరువాత డబ్బులిచ్చారు. ఈసారి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలని చూస్తున్నారట. కొందరు కంటెస్టెంట్ లకు మరీ తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట. రోజుకి ఇన్ని వేలు మాత్రమే ఇవ్వగలమని చెబుతున్నారట. దీంతో కంటెస్టెంట్ లలో షోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ కూడా కనిపించడం లేదు. ఇప్పటికైనా ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన పేరున్న తారలను తీసుకొస్తారేమో చూడాలి!