Bigg Boss Telugu 6 Winner: బిగ్ బాస్ ఫినాలే హైలెట్స్..! ఎవరు ఏ పొజీషన్స్ లో ఉన్నారంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫినాలే స్టేజ్ దద్దరిల్లిపోయింది. అలనాటి అందాల హీరోయిన్ రాధ రాక ఆడియన్స్ కి మంచి ఊపునిస్తే, మాస్ రాజా రవితేజ ఎంట్రీ వ్యూవర్స్ కి కిక్ ఇచ్చింది. హీరో నిఖిల్ చమక్కులు, హీరోయిన్ తళుక్కులు, మాజీ కంటెస్టెంట్స్ పెర్ఫామన్స్ లతో స్టేజ్ హోరెత్తిపోయింది. ఇక నాగార్జున హౌస్ మేట్స్ తో కొన్ని టాస్క్ లు చేయిస్తూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేశాడు. ముందుగా రోహిత్ టాప్ – 5 పొజీషన్ లో ఎలిమినేట్ అయ్యాడు.

నిజానికి మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన శ్రీసత్య తర్వాత హౌస్ లో ఐదుగురు మాత్రమే మిగిలిన సంగతి తెలిసిందే. ఇక నాలుగో పొజీషన్ లో ఆదిరెడ్డి ఉన్నాడు. ఆదిరెడ్డి ఎలిమినేషన్ తర్వాత అసలు మాజా అనేది స్టార్ట్ అయ్యింది. సూట్ కేస్ ఆఫర్ తో మాస్ రాజా రవితేజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ బ్రీఫ్ కేస్ లో మనీ తీస్కుని హౌస్ నుంచీ బయటకి వచ్చేయమని చెప్పాడు.

కానీ, ఆఫర్ ని మాత్రం ఎవరూ తీస్కోలేదు. ఇక్కడే కీర్తిని రవితేజ ఒక ఆట ఆడుకున్నాడు. చాలా హింట్స్ ఇచ్చాడు. అయినా కూడా కీర్తి మనసు కరగలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ లో రవితేజ ఎంట్రీ ఇవ్వగానే హౌస్ మేట్స్ ఒక్కసారి ఖంగుతిన్నారు. తమ ఫేవరెట్ హీరోని చూస్తూ ఆఫర్ ని రిజక్ట్ చేశారు. కీర్తి , రేవంత్, శ్రీహాన్ ఎవరూ కూడా ఆఫర్ ని తీస్కోలేదు. ఆ తర్వాత మూడో పొజీషన్ లో కీర్తి ఎలిమినేట్ అయ్యింది.

బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ గా శ్రీహాన్ ఇంకా రేవంత్ ఇద్దరు మాత్రమే టైటిల్ రేస్ లో నిలబడ్డారు. వీరిద్దరిలో ఫైనల్ గా రేవంత్ టైటిల్ విన్నర్ అయిన సంగతి తెలిసిందే. విన్నర్ అయిన రేవంత్ కి ట్రోఫీతో పాటుగా 50 లక్షలు ప్రైజ్ మనీ, సువర్ణభూమి వారి నుంచీ 605 గజాల స్థలం, ఇంకా మారుతి వారి బ్రీజా కార్ ఇచ్చారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus