నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘బింబిసార’ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.సోషియో ఫాంటసీ కథాంశంతో ఆసక్తికర కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీ… ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? అనే డౌట్ చాలా మందికి వచ్చింది? దీనికి సమాధానం దిల్ రాజు చెప్పేశారు. ‘బింబిసార’ సక్సెస్ మీట్లో భాగంగా 50 రోజుల తర్వాతే ఈ చిత్రం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది అని ఆయన తేల్చి చెప్పేశారు.
‘బింబిసార’ కి నైజాం డిస్ట్రిబ్యూటర్ ఆయనే అన్న సంగతి తెలిసిందే. ఆయన గత చిత్రం ‘ఎఫ్3’ విషయంలో కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యారు.అందువల్ల చాలా వరకు ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రికవరీ సాధించింది. అయితే దిల్ రాజు మాటల ప్రకారం ఆగస్టు 5న థియేటర్లలో విడుదలైన ‘బింబిసార’ … 50 రోజులు తర్వాత అంటే సెప్టెంబర్ 23, ఆ టైంకి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. ‘బింబిసార’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ను ‘జీ 5’ సంస్థ సొంతం చేసుకున్నట్లు వినికిడి.
అయితే ఎంత రేటుకి కొనుగోలు చేసుకున్నది బయటకు రాలేదు.ఇక ‘బింబిసార’లో కళ్యాణ్ రామ్ డబుల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. హీరోయిన్లుగా సంయుక్త మీనన్, కేథరిన్ లు నటించారు. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ రూ.45 కోట్ల బడ్జెట్లోనే ఓ విజువల్ వండర్ ను ప్రేక్షకులకు అందించాడు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.