Bimbisara: ఆ విషయంలో కళ్యాణ్ రామ్ నిర్ణయం సరైనదే.. కానీ?

కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన బింబిసార సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు. ఈ నెల 29వ తేదీన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా తారక్ ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరవుతున్నారు.

ఈ సినిమా రన్ టైం 2 గంటల 26 నిమిషాలు అని సమాచారం. సెన్సార్ పూర్తైన తర్వాత నిడివి విషయంలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం అయితే ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంలో నిడివి కూడా కీలక పాత్ర పోషిస్తుందనే సంగతి తెలిసిందే. నిడివి విషయంలో కళ్యాణ్ రామ్ నిర్ణయం రైటేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంత మంచివాడవురా సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

దాదాపుగా రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించి విడుదలవుతున్న సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో త్రిగర్తల రాజ్య ప్రభువు అయిన బింబిసారుని పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. బింబిసార పార్ట్1 సక్సెస్ సాధిస్తే బింబిసార పార్ట్2, బింబిసార పార్ట్3 తెరకెక్కే అవకాశాలు అయితే ఉంటాయి.

ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఖాతాలో సక్సెస్ చేరుతుందో లేదో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని కళ్యాణ్ రామ్ తో చెప్పినట్టు బోగట్టా. సొంత బ్యానర్ లోని సినిమాలలోనే ఎక్కువగా నటిస్తున్న కళ్యాణ్ రామ్ కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తూ ఆ దర్శకులకు గుర్తింపు రావడానికి కారణమవుతున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాతో దర్శకులుగా పరిచయమైన సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus