ఈ నెల 5వ తేదీన విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. బింబిసార మూవీ మాస్, కామెడీ సినిమాలను ఇష్టపడే వాళ్లకు నచ్చితే సీతారామం సినిమా క్లాస్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఎంతగానో నచ్చుతోంది. ఈ రెండు సినిమాల ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థల వివరాలు లీక్ అయ్యాయి. సీతారామం డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది.
బింబిసార సినిమా హక్కులను మాత్రం ప్రముఖ ఓటీటీలలో ఒకటైన జీ5 కొనుగోలు చేసింది. బింబిసార సినిమా 50 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. అమెజాన్ ప్రైమ్ తక్కువ సమయంలోనే సినిమాలను స్ట్రీమింగ్ చేస్తుంది కాబట్టి సీతారామం మూవీ బింబిసార కంటే ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో చూడాల్సి ఉంది. తొలిరోజు ఈ రెండు సినిమాలకు కలెక్షన్లు బాగానే ఉన్నాయని వీకెండ్ వరకు ఈ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ రెండు సినిమాల విజయాలతో కళకళలాడే ఛాన్స్ అయితే ఉంది. జులై నెలలో రిలీజైన సినిమాలు షాక్ ఇచ్చినా ఆగష్టు నెల తొలివారంలో రిలీజైన సినిమాల వల్ల బయ్యర్లు సంతోషిస్తున్నారు.
మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ2 సినిమాలు బింబిసార, సీతారామం సినిమాల సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నెలలో రిలీజ్ కానున్న లైగర్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెలలో రిలీజయ్యే సినిమాలు 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ చేశాయని ఈ సినిమాలు 600 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉందని బోగట్టా.